Saakshyam
Nothing scared but the truth

ఎవరూ ఏమీ భయపడవద్దు…ఎవరినీ తిట్టుకోవద్దు. 

Murali Muchatlu by Ilapavuluri Murali Mohan Rao

0

Ilapavuluri Murali Mohan Rao

కాంగ్రెస్ తో కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసిన తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతినడంతో ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. కాంగ్రెస్ తో కలిస్తే పుట్టగతులు ఉండవని తెలుగుదేశం అధినాయకుడికి అర్ధం కావడంతో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చెయ్యడం కుదరదు. పుట్టినప్పటినుంచి పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్న ధైర్యం చెయ్యలేని తెలుగుదేశం పార్టీ మరి ఎవరితో కలిసి పోటీ చెయ్యాలి?

 

ఇంకెవరు?  పాపాలభైరవుడు పవన్ కళ్యాణ్!

 

అవును… ఇది నిజం…ఈ మేరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పవన్ లక్ష్యం రాష్ట్రముఖ్యమంత్రి కావడం కాదు. జగన్ ను ముఖ్యమంత్రి కాకుండా నివారించడం అని అందరికీ తెలుసు. పైగా పార్టీ పెట్టినప్పటినుంచి పెద్దగా నాయకులు ఎవ్వరూ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపించకపోవడం,  విపరీతమైన ఎన్నికల ఖర్చు భరించే తాహతు జనసేనకు లేకపోవడం,  చంద్రబాబుకు వ్యతిరేకంగా వెళ్తే మీడియా కవరేజ్ దక్కదు అనే భయం..వెరసి పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం తో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

 

ఇక పవన్ తినగా ఏమైనా ఎముకలు మిగిలితే వాటిని నాకైనా ఆకలి తీర్చుకోవాలని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్న వామపక్షాలు పవన్ మీద బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నాయి. కానీ, పవన్ కు ఎంత భజన చేసినా, పవన్ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు.  గత ఏడాదికాలంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలమీద లెక్కలేనన్ని సర్వేలు వెలువడ్డాయి. ఏ ఒక్క సర్వేలో కూడా జనసేనకు పదిసీట్లు మించి ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఎన్నికలు మరో మూడునెలలకు వచ్చినా..పవన్ లో స్తబ్దత వీడటం లేదు.

 

పవన్ కు ఉన్న అభిమానుల సంఖ్య దృష్ట్యా తమ గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయగలడని తెలుగుదేశం నాయకులు విశ్వసిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, వైసిపి విడివిడిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకే నష్టం అని చంద్రబాబు నిశ్చయానికి వచ్చారని,  అందువలన గతం గతః అనుకుని పవన్ ను మచ్చిక చేసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయం. వైద్యుడు చెప్పింది అదే..రోగి కోరింది అదే అన్నట్లు పవన్ కు కూడా చంద్రబాబుతో కలిసి పోటీ చెయ్యడమే మంచిది అనే అభిప్రాయానికి వస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

 

తెలుగుదేశం, జనసేన మధ్యన ఒప్పందం సఫలం అయితే…అయితే ఏమిటి?  అయ్యి తీరుతుంది…జనసేనకు, వామపక్షాలకు కలిపి ముప్ఫయి సీట్లు వదలడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.  వారి ఖర్చంతా చంద్రబాబుదే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్, బీజేపీ ఎలాగు బృహన్నలకు కాస్త తక్కువే కాబట్టి..వాటికి ఎక్కడా డిపాజిట్స్ కూడా వచ్చే ఛాన్స్ లేదు.

 

సో…తెలుగుదేశం + జనసేన+వామపక్షాలు+లోక్ సత్తా కూటమి Vs   వైసిపి … ఈ రెండే రాబోయే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్ధులు…

యువర్ ఆనర్…నోట్ దిస్ పాయింట్.

 

కథనం మరియు విశ్లేషకులు:

ఇలపావులూరి మురళీ మోహన రావు గారు.

You might also like