Saakshyam
Nothing scared but the truth

చేతులు ముడుచుకున్న మోడీ

Murali Muchatlu by Ilapavuluri Murali Mohan Rao

0

Ilapavuluri Murali Mohan Rao

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పై అవినీతి ఆరోపణలమీద రాష్ట్రానికి చెందిన ఎసిబి కేసు నమోదు చేసింది. బహుశా దేశచరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారేమో?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద, అవినీతిపరులమీద సిబిఐ ఏమీ చర్య తీసుకోలేదన్న మాట! కేంద్ర ప్రభుత్వోద్యోగులు అవినీతికి పాల్పడితే రాష్ట్ర ఎసిబి చూస్తూ ఊరుకోదు అని డీజీపీ ఘాటుగా హెచ్చరించారు. అసలు రాష్ట్రంలో సీబీఐని అడుగు పెట్టనీయమన్నా కూడా కేంద్రం చేతులు ముడుచుకుని చోద్యం చూస్తున్నదంటే ఏమి చెప్పాలి?

ఇంత బలహీనమైన చవటాయి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో మోడిదే అయివుంటుంది. పదమూడు జిల్లాల ముఖ్యమంత్రి, అందునా రాష్ట్రాన్ని లూటీ చేసాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నా, మేకపోతు గంభీర ప్రకటనలకు మాత్రమే పరిమితమై పోయిన బీజేపీ నాయకులను చూస్తుంటే ఇంత పిరికివారు దేశాన్ని ఎలా పాలిస్తున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది.

ఇప్పటికి వినిపిస్తున్న వార్తలను బట్టి రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘోరంగా పరాజయం చెందనుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడతాయని సర్వేలే కాదు, ప్రజలు కూడా నమ్ముతున్నారు. అదే జరిగితే ఇక చంద్రబాబు మోడీని బంతాట ఆడుకుంటారు అనడంలో సందేహం అక్కర్లేదు.

కథనం మరియు విశ్లేషకులు:

ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు.

 

You might also like