Saakshyam
Nothing scared but the truth

చక్కనయ్యా.. చందమామా.. ఎక్కడున్నావూ?

Murali Muchatlu by Ilapavuluri Murali Mohan Rao || Election News || Saakshyam

0

Ilapavuluri Murali Mohan Rao

Murali Muchatlu On Missing Of Lokesh In Campaign || Telugu Political  News || Saakshyam

తెలంగాణాలో గత నెలరోజులుగా జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రం (5 -12 -2018 ) తో తెరపడనుంది (Murali Muchatlu On Missing Of Lokesh In Campaign || Telugu  News). టీఆరెస్, బీజేపీ లు ఒంటరిగా పోటీ చేస్తుండగా, జాతీయకాంగ్రెస్ పార్టీ తన స్థాయిని దిగజార్చుకుని, తన బద్ధశత్రువైన తెలుగుదేశం తో కలిసి, మరో రెండు చిల్లర పార్టీలు టీజేఎస్, సిపిఐ తో మహాకూటమి పేరుతో రంగంలోకి దిగింది. అన్ని పార్టీల అగ్రనాయకులు అందరూ యధాశక్తి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ నాయకులకంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు వన్ మాన్ షో అన్నట్లు ప్రచారం చెయ్యగా, స్థానిక కాంగ్రెస్ అగ్రనాయకులు దిష్టిబొమ్మల్లా చంద్రబాబు, రాహుల్ పక్కన నిలుచోవాల్సి వచ్చింది. ఇక బాలకృష్ణ కూడా బాగా రెచ్చిపోయి తన ప్రచారంతో, పాండిత్య ప్రదర్శనతో కడుపుబ్బా నవ్వించాడు.

అయితే అందరూ ప్రచారం చెయ్యడం వేరు. ఆ యువకిశోరం ప్రచారం చెయ్యడం వేరు. అతను రాలేదా? ఎందుకు రాలేదు? బిజీయా? ప్రపంచం మొత్తం పర్యటిస్తూ పెద్ద పెద్ద కంపెనీలను ఈడ్చుకొస్తున్నాడా? లక్షలాదిమంది నిరుద్యోగులకు కొలువులు పంచుతున్నాడా? తండ్రి కంటే తీరిక లేకుండా ఉన్నాడా? ఎక్కడ అతగాడు? అంటూ తెలంగాణ మొత్తం చకోర పక్షిలా ఎదురు చూసింది. కానీ, ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి కూడా ఆ పండితపుత్రుడు పత్తా లేడు.

అతనెవరో ఈపాటికి అర్ధం అయ్యే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటి శాఖామాత్యుడు నారా లోకేష్ నాయుడు గారు! ఆంధ్రప్రదేశ్ ఆశాదీపం, తెలుగుదేశం పార్టీకి భవిష్య దిక్సూచి నారా లోకేష్ తెలంగాణాలో ప్రచారం చేయకపోవడంతో పెద్దగా ఊపు రాలేదని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకు రాలేదు? అతనికేమైనా అనుభవం తక్కువా? GHMC ఎన్నికలలో రాత్రింబవళ్లు చండప్రచండంగా ప్రచారం చేసి నూట యాభై సీట్లకు కాను ఒక్క సీటును గెలిపించిన వీరుడు.

Murali Muchatlu On Missing Of Lokesh In Campaign || Telugu  News || Saakshyam

ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరుమాసాల్లో జరగనున్న శాసనసభా ఎన్నికల్లో ప్రచారం చెయ్యడంలో నేర్పరితనాన్ని గడించడానికి తెలంగాణ ఎన్నికలు సువర్ణావకాశం కదా! ఇక్కడ బాగా శిక్షణ పొంది రేపు ఆ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకోవాలి కదా? పోనీ, ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఢిల్లీ దగ్గరో, కాశ్మీర్ దగ్గరో లేదు కదా! అమరావతి నుంచి కారులో అయితే నాలుగు గంటల్లో, విమానంలో అయితే యాభై నిముషాల్లో చేరుకునే వీలున్న ప్రాంతం. పైగా లోకేష్ పుట్టింది, పెరిగింది, సతికింది హైదరాబాద్ లోనే. హైద్రాబాద్ లో పెరగడం వలన హిందీ, అమెరికాలో చదవడం వలన ఇంగ్లిష్ కూడా కొట్టినపిండి. మరెందుకు అవకాశాన్ని వినియోగించుకోలేదు?

కొందరు తెలుగుదేశం పార్టీవారు చెపుతున్న దాని ప్రకారం తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి గెలిచే అవకాశం లేదని, తెలుగుదేశం పార్టీకి ఎంత చించుకున్నా రెండు సీట్లు కూడా రావని, సాక్షాత్తూ నందమూరి హరికృష్ణ కుమార్తె పోటీ చేస్తున్న కూకట్ పల్లిలోనే ఆమెకు డిపాజిట్ వచ్చే అవకాశం లేదని, అందువల్ల ఇక్కడ లోకేష్ తో ప్రచారం చేయిస్తే పరువుపోవడం మినహా మరొకటి లేదని, పైగా రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందని చంద్రబాబుగారి ఆలోచన అని, పైగా ఒక బావమరిది తోనే చస్తుంటే, మళ్ళీ కొడుకును తెచ్చి పెట్టుకుంటే ఆ భారం భరించడం కష్టమని బాబుగారి అభిప్రాయం అంటున్నారు. అంతెందుకు, నలభై ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబే, మొన్న పొరపాటున కాంగ్రెస్ ను ఓడించండి అని మనసులో మాటను బయటకు కక్కేశారు. ఇక లోకేష్ ను కూడా తెచ్చి ప్రచారం చేయిస్తే తెలుగుదేశం పార్టీనే భూస్థాపితం చెయ్యమని ప్రచారం చేసే ప్రమాదం ఉన్నదని శంకించి కొడుకును దూరంగా పెట్టారని గుసగుసలాడుకుంటున్నారు.

 

కథనం మరియు విశ్లేషకులు:

ఇలపావులూరి మురళీ మోహన రావు గారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Read Another : బాలకృష్ణ ప్రచారానికి ఎన్నికల సంఘం నిరాకరణ

You might also like