Saakshyam
Nothing scared but the truth

చంద్రబాబు ప్రభుత్వం పై ధ్వజమెత్తిన అజయ్ కల్లమ్

Murali Muchatlu by Ilapavuluri Murali Mohan Rao

0

Ilapavuluri Murali Mohan Rao

ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి వెధవలైనా మంత్రులు అవుతున్నారు….
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లమ్…
ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. కల్లమ్ గారు… వెధవలు కాదు…వెధవన్నర వెధవలు, పరమ శుంఠలు, ఒక్క మాట కూడా సరిగా మాట్లాడలేని నిరక్షరకుక్షులు మంత్రులు అవుతున్నారు. అలాంటి వెధవల ముందు ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తున్నదని మీ బాధ..

ఇక ఆరువందలమనేది ఒక్కొక్కరు అయిదు వందలకోట్ల రూపాయలు దోచుకున్నారని, ముఖ్యమంత్రి సైతం నింగి నేల మాత్రమే హద్దుగా దోచుకుంటున్నారని మీరు చేసే ఆరోపణల్లో అవాస్తవం ఉంటుందని నేను అనుకోను. గత నాలుగేళ్లలో ప్రాజెక్టులకు ఖర్చు చేసిన యాభైవేల కోట్లలో ఇరవైవేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీరు ఆరోపిస్తే అది నూటికి నూరుపాళ్లు యదార్ధమే అయి ఉంటుంది.

రాయపాటి, కావూరి, రమేష్, నవయుగ పేర్లను కూడా వెల్లడించారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీలాంటివారు ఎలా పనిచేసారో కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. రేపు ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వస్తే ఈ అవినీతిపరులందరిని జైళ్లకు పంపిస్తారని నేను నమ్ముతున్నాను.

గాలికి ధూళికి తిరుగుతూ గాలిమాటలు మాట్లాడే ఒక నాయకుడు ఇలాంటి అవినీతిని ప్రశ్నించకుండా, ప్రతిపక్షనాయకుడి మీద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతుంటే అతగాడికి ఎంత పాకేజీ ముట్టిందో కదా?

 

కథనం మరియు విశ్లేషకులు:

ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు.

You might also like