Saakshyam
Nothing scared but the truth

ఆ నోట్ల కట్టలు ఎవరివి?

Murali Muchatlu by Ilapavuluri Murali Mohan Rao || Election News || Saakshyam

0

Ilapavuluri Murali Mohan Rao

Murali Muchatlu On Chandrababu How Making Money Politics || Telugu Political News || Saakshyam

పెద్దనోట్ల రద్దుతో దేశంలో నల్లధనం మటుమాయం అయిపోయిందని ఈనాటికి కూడా మోడీ గారు డప్పు కొడుతుంటారు (Murali Muchatlu On Chandrababu How Making Money Politics). కానీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు పట్టుకున్న నోట్లకట్టల విలువ రెండు వందలకోట్ల పైమాటే. ఇంకా పట్టుబడని కోట్లు ఎన్నో? ఆ పట్టుబడిన నోట్లు ఎవరివో తెలియదట పోలీసువారికి! వాటిని బ్యాంకు నుంచి డ్రా చేశారా లేక నేతల ఇళ్లలో నేలమాళిగల నుంచి తీసారా తెలుసుకోవడం కష్టమా? ఆ కట్టలు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే అవి ఎవరివో ఆమాత్రం తెలియదా? ఈరోజుకు కూడా ఏటీఎంలలో పదివేలు దొరకడం లేదు. మరి ఈ పట్టుబడుతున్న డబ్బంతా నల్లధనం కాదా?

Murali Muchatlu On Chandrababu How Making Money Politics || Telangana News || Saakshyam

మూడు రోజుల నుంచి ఒక సంభాషణా క్లిప్పింగ్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కమ్మసమాజం వారు కూకట్ పల్లిలో దిగిన కమ్మవారితో మాట్లాడుతున్నారు. “మనం ఎంత ప్రయత్నించినప్పటికీ, డబ్బులు పంచుతున్నప్పటికీ, కూకట్పల్లిలో తెలుగుదేశం కు అనుకూల వాతావరణం లేదని, చంద్రబాబుకు కూడా ఇక్కడ పాజిటివ్ గా లేదని వారు చెప్పుకుంటున్నారు. మన కమ్మవారు కూడా మనకు సహకరించడం లేదని, ఇక రాజులు అందరూ కేసీఆర్ వైపు చేరారని, సుహాసిని గెలిచే అవకాశం లేదని” వారు మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే పట్టుబడుతున్న నోట్ల కట్టలు అన్నీ తెలుగుదేశం పార్టీ వారివే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఇక పొద్దస్తమానం నీతులు వల్లించే తెలుగుదేశం నేత జూపూడి ప్రభాకర రావు ఇంటికి సమీపంలో పదిహేడు లక్షల రూపాయల కట్టలు దొరికాయట. పోలీసులను చూడగానే డబ్బు తెచ్చినవారు గోడదూకి పారిపోగా, వారిలో ఒకరిని పట్టుకున్నారు. వాడిమీద పోలీసులు ‘తమదైన శైలిని’ ప్రదర్శిస్తే నిజం కక్కడా?

తెలంగాణ ఎన్నికల్లోనే ఇన్నిన్ని కోట్లు ఖర్చు చేస్తుంటే ఇక రేపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చేసే ఖర్చుకు పగ్గాలు ఉంటాయా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే తిష్టవేసి, వేలాదిమంది సిబ్బందిని అభ్యర్థుల చుట్టూ మోహరించి, క్షణం క్షణం వారిని కాపలా కాయకపోతే, ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.

కథనం మరియు విశ్లేషకులు:

ఇలపావులూరి మురళీ మోహన రావు గారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Read Another : తెలంగాణా ప్రజలారా, మళ్లీ మళ్లీ చంద్ర(బాబు)గ్రహణం కావాలా? ఆలోచించి ఓటెయ్యండి

You might also like