Saakshyam
Nothing scared but the truth
Page Right

పాపం ప్రణయ్ అమృత పరిస్థితి లాగే మరొక జంట…!!

Meenu and Joseph Love Story

0

Meenu and Joseph Love Story || Saakshyam Telugu Crime News

గత కొద్ది రోజుల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ (Meenu and Joseph Love Story) హత్య సంచలనాన్ని సృష్టించింది. కులాంతర వివాహం చేసుకున్నారని అమృత తండ్రి మారుతిరావు అలాగే బాబాయ్ శ్రవణ్ ఇద్దరు కలిసి భారీ స్కెచ్ వేసి ప్రణయ్ ని అమృత కళ్ళ ముందే హతమార్చారు కనీసం పెళ్లి అయ్యి సంవత్సరం కూడా కాలేదు పైగా అమృత ఆ సమయంలో కడుపుతో ఉన్నది అని కూడా చూడకుండా అతి దారుణంగా ప్రణయ్ ని చంపేశారు. ఇద్దరు కలిసి ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు జీవితాంతం కలిసి బ్రతకాలి అని భావించారు అందుకే తల్లిదండ్రులను కాదనుకొని అమృత ప్రణయ్ దగ్గరకు వచ్చి ఆర్య వైశ్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. గ్రాండ్ గా రిసెప్షన్ జర్పుకున్నారు కాని అది అంత కూడా మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది.

ప్రస్తుతం అమృత ప్రణయ్ కి న్యాయం జరగాలి అతనిని చంపినవారికి ఉరిశిక్ష పడాలి అంటూ పోరాడుతుంది. ఇందులో భాగంగానే ప్రణయ్ హత్యలో భాగస్వాములు అయినవారందరినీ కూడా పోలీసులు తమ కస్టడిలోకి తీసుకున్నారు. ఈ హత్య మరవతలికే హైదరాబాద్ లో మరో రెండు సంఘటనలు జరిగాయి, ఇలా ప్రేమించిన వారందరూ బలి కావాల్సిందేనా కలిసి జీవించే భాగ్యం లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అయితే తాజాగా ప్రణయ్ అమృత తరహాలోనే మరో ప్రేమ జంట బలైపోయారు. ఇది ఎక్కడ జరిగింది? ఏం జరిగింది?

Meenu and Joseph Love Story || Telugu Crime News

వివరాల్లోకి వెళ్తే..ఆమె పేరు నీనూ(21), అతని పేరు జోసెఫ్(23) ఇద్దరు కూడా కేరాలకి చెందినవారే. అయితే జోసెఫ్ ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తూ ఉంటాడు, వీరిద్దరి రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.

ఆ ప్రేమ ని పెళ్ళిగా మలచుకోవాలి అని అనుకున్నారు అనుకున్నట్లుగానే ఇద్దరు కలిసి గత రెండు రోజుల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఇక ఆ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు, దాంతో జోసెఫ్ ని కిడ్నాప్ చేసి అతడిని చంపేసి కెనాల్‌లో పడేశారు. ఈ ఘటనకు సంబంధించి కొట్టాయం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు ఈ కేసును పరువు హత్య‌గా తేల్చింది. ఈ కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. కేవలం ఇదంతా జరగడానికి కారణం కులాంతర వివాహం అందులోను ప్రేమ పెళ్లి దాంతో అతను శవంలాగా మారిపోయాడు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Click Here For Another : మరో పరువు హత్య ఈసారి ఏం జరిగిందో తెలుసా…?

You might also like