Saakshyam
Nothing scared but the truth

శ్రీనివాస్ పై మరో సంచలన నిర్ణయం తీసుకున్న పోలీసులు…!!

0

Ys jagan mohan reddy,  Srinivas,  Attack

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై శ్రీనివాస్ అనే ఒక సాధారణ వ్యక్తీ కోడిపందేలా కత్తితో అందరిముందే దాడికి పాల్పడ్డాడు ఆ దాడిలో జగన్ గాయపడ్డారు మూడు కుట్లు కూడా పడ్డాయి. మొత్తానికి తన దాడితో శ్రీనివాస్ జగన్ పాదయాత్ర ఆగిపోయేలా చేసాడు. అయితే ఈ కుట్ర వెనుక మాత్రం ఎవరి హస్తం ఉందో ఇప్పటివరకు కూడా బయటకి రాలేదు కొంతమంది ఈ కుట్రకి కారణం పక్కగా టీడీపీ ప్లానె అంటూ వ్యాఖ్యలు చేస్తుంటే అధికారపార్టీ నేతలు మాత్రం కావాలనే జగన్ తనపైన సింపతి రావాలని ఈ దాడి చేపించుకున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైతే నెం దాడికి పాల్పడ్డా శ్రీనివాస్ ని మాత్రం పోలీసులు తమ కస్టడిలోకి తీసుకోని విచారణలు జరుపుతున్నారు ఇప్పటికి ఈ దాడి జరిగి 1 రోజులు పై మాట కాని ఇంతవరకు ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. తాజాగా శ్రీనివాస్ కేసుపై పోలీసులు మరో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అదేమిటంటే జె.శ్రీనివాసరావుని మరోసారి కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్‌ వేయాలని భావిస్తున్నారు. ఈ దాడి జరిగింది 25 వ తారీకు ఇక ఆరోజు పోలీసులు శ్రీనివాస్ ని కస్టడిలోకి తీసుకోని విచారణ జరిపి 26 వ తారీకు అరెస్ట్ చేశారు. కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున శ్రీనివాసరావుని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్‌ వేయడంతో ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మొత్తానికి అటు ఇటు చేసి పోలీసులు శ్రీనివాస్ నుండి కాస్తా సమాచారాన్ని రాబట్టారు. అంతటితో ఆగకుండా శ్రీనివాస్ తోపాటు అతని కుటుంబ సభ్యులు, అలాగే మొత్తం 321 మందిని విచారించి చాలావరకూ సమాచారం సేకరించారు. అయితే ఈ విషయంపై కొంతమంది సమాచారం విరుద్దంగా ఉండడంతో దానిపైన స్పష్టత కోసం శ్రీనివాస్ (Srinivas)ని మరొకసారి విచారిచాలని పోలీసులు భావించారు దాంతో అతన్ని మళ్ళి కస్టడిలోకి తీసుకోవాలని అనుకున్నారు అందుకే తాజాగా సోమవారం మరోసారి కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేయాలని భావిస్తున్నారు.

Click here : ఐటీ దాడులు ఇచ్చిన షాక్ కి మంత్రులతో భేటీ అయిన బాబు….!!

You might also like