Saakshyam
Nothing scared but the truth

లగడపాటి సర్వే లాబీల సర్వే – శైలజా చరణ్ రెడ్డి

Lagadapati Servey Is Lobbying Servey || Election News || Saakshyam

0

Lagadapati Servey Is Lobbying Servey || Telugu Political News || Saakshyam

లగడపాటి సర్వే లాబీల సర్వే అని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారని (Lagadapati Servey Is Lobbying Servey )  తెలంగాణలో  చంద్రబాబు ఆటలిక సాగవని, మాయా కూటమి ఇక మాయం అయ్యే విధంగా తీర్పు  ఉండబోతుందని చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ శైలజా చరణ్ రెడ్డి  జోస్యం  చెప్పారు.

ఈరోజు తెలంగాణ ప్రజలు  మహా కూటమిని మాయ కూటమిగా.. మాటల కూటమిగా..  భావిస్తున్నారు  అని ఆమె అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని విమర్శించే తీరు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులను చూస్తుంటే చంద్రబాబు  ఊరి వేసుకోవలసిన పరిస్థితులని,  అయినా చంద్రబాబు తెలంగాణను వదలకుండా తిరుగుతున్నాడు అంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదని ఆమె సూచించారు.

Lagadapati Servey Is Lobbying Servey || Telangana News || Saakshyam

చంద్రబాబును ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని  ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి తెలంగాణ కి ఎందుకు వచ్చాడు అనే సందేహం తో ప్రజలు ఉన్నారని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ని మంట  కలిపి ఈ రోజు  తెలంగాణను ఎవరికి తాకట్టు పెడతాడో అని ప్రజలు భయపడుతున్నారని  తరిమి తరిమి కొట్టడానికి కూడా సిద్ధమయ్యారని  ఆమె విమర్శించారు.

ఈ సారి తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పు  చంద్రబాబునాయుడు మళ్లీ ఒకసారి తెలంగాణ వైపు చూడకుండా ఉండే విధంగా ఉంటుందని  ఆమె సూచించారు  తెలంగాణ ప్రజలు కబడ్ధార్ ….చంద్రబాబు అంటూ హెచ్చరిస్తున్నారు అని ఆమె గుర్తు చేశారు.

లగడపాటి సర్వే లాబీల సర్వే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు మరియు తన మిత్రపక్షాలు ఇంకా ఎన్నో జిమ్మిక్కులను ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేస్తూ, తన ఎల్లో మీడియా ద్వారా  తప్పుడు ప్రచారాలను  చేపిస్తూ ప్రజలను నమ్మబలికే విధంగా ప్రయత్నిస్తారని ఆమె చెప్పారు.

కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా  సూచిస్తూ  తమ  అమూల్యమైన ఓటును ప్రజల కోసం పనిచేసే నిజమైన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేసి  ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి అని ఆమె తెలిపారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Read Another : లగడపాటి గుట్టు విప్పిన కేటీయార్

You might also like