Saakshyam
Nothing scared but the truth

రెండు చిలకలు పంపిస్తా చిలక జోస్యం చెప్పుకో రాజగోపాల్ : కేటీఆర్

0

తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎప్పుడు ఎదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకోవడం అలా పొత్తు పెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకోవడం అందరికి తెలిసిన విషయమే, అదే తరహాలో తెలంగాణాలో కూడా టీఆర్ ఎస్ పార్టీ తో పొత్తు పెట్టుకోవాలని తనవంతు ప్రయత్నాలు చెయ్యడం నిజమేనని అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ ని అడ్డుపెట్టుకొని మైండ్ గేమ్ ఆడుతుందని తెలంగాణా మంత్రి కేటీఅర్ ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణాలో తనదైన స్టైల్లో లో చక్రం తిప్పిన టీఆర్ ఎస్ పార్టీ కి గత కొద్ది రోజుల నుండి ఓటమి భయం పట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దినంతటికి కారణం లగడపాటి లేటెస్ట్ సర్వే అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే కి తిరుగులేదని చెప్తారు కాని అతను తాజాగా వెల్లడించిన సర్వే మాత్రం టీఆర్ ఎస్ కి భిన్నంగా ఉంది తెలంగాణాలో ఈసారి టీఆర్ ఎస్ అధికారంలోకి రావడం కష్టమేనని తేల్చి చెప్పింది.

దాంతో ఈ విషయంపై స్వయంగా కేటీఆర్ స్పందించారు అతని సర్వే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటి సర్వే వెనుక చంద్రబాబు హస్తం ఉందని మండిపడ్డారు. వాస్తవానికి తెలంగాణాలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి కరణ్ కూడా రాజగోపాలే అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చిన తరువాత తమకు 4 శాతం ఓట్లు పెరిగాయని అన్నారు. 11వ తేదీన వెలువడే ఫలితాలతో లగడపాటికి దిమ్మ తిరిగిపోతుందని అన్నారు. ఇక ఇదే నేపధ్యంలో ఆయనకు రెండు రామచిలుకలని పమిపిస్తా చిలక జోస్యం చెప్పుకోవమని అన్నారు.

తాజాగా హైదరాబాద్ లో మీడియాతో చిత చాట్ చేసిన అయన ఈ వివరాలని వెల్లడించారు, 20 నుంచి 22 నియోజకవర్గాలను ఎంపిక చేసి సర్వే జరిపి ఇవ్వాలని లగడపాటిని తానే కోరానని, 23 చోట్ల సర్వే చేయించిన ఆయన, 19 సీట్లు వస్తాయని చెప్పారని, ఆపై అక్టోబర్ 20 నుంచి నవంబర్ 20 మధ్య సర్వే చేయించగా, 65 నుంచి 70 సీట్లతో టీఆర్ఎస్ గెలవనుందని ఆయన చెప్పారని గుర్తు చేశారు. మొత్తం మీద 100 సీట్లు గెలవడం ఖాయమని ఆయనే తెలిపారు అని పేర్కొన్నారు. మొత్తానికి చంద్రబాబు ఒకవైపు ఏపీ లో మరొకవైపు తెలంగాణాలో తనకు తానె వ్యతిరేకతని క్రియేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. చూద్దాం ముందస్తు ఎన్నిఅక్ల్లో ఏం జరగబోతుందో.

You might also like