Saakshyam
Nothing scared but the truth

లగడపాటి గుట్టు విప్పిన కేటీయార్

Ktr revealed secret behind Lagadapati survey

0

KTR Revealed Secret Behind Lagadapati Survey | Telugu Political News

సర్వే అంటూ రోజుకో విషయాన్నీ చెప్తున్న లగడపాటి అసలు గుట్టును తెలంగాణ ఆపధర్మ మంత్రి కేటీయార్ బయటపెట్టారు. ( KTR Revealed Secret Behind Lagadapati Survey )టీఆర్‌ఎస్‌ పార్టీకి 65–70 సీట్లు వస్తాయంటూ గత నెల 20న లగడపాటి తనకు పంపిన మెసేజ్‌ను ఆయన మంగళవారం ట్విట్టర్‌లో బయటపెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే ఫలితాన్ని మార్చారని కేటీఆర్‌ ఆరోపించారు. లగడపాటి సర్వేను ఆయన తప్పుపట్టారు.  సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను బయటపెట్టేందుకే తాను ఆ మెసేజ్‌ను షేర్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

Ktr revealed secret behind Lagadapati survey

KTR Revealed Secret Behind Lagadapati Survey | Telugu News

నవంబర్‌ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫలితాలు చెప్పానని, కేసీఆర్‌ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్పిన లగడపాటి.. తన అంచనాలను మించి టీఆర్‌ఎస్‌ సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదని అన్నారని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ విషయం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి కేటీఆర్‌కు పంపిన మెసేజ్‌లో తెలిపారు. లగడపాటిది సర్వే కాదని, చిలక జోస్యమని ఆయన ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే లాస్ట్‌ మినట్‌ ప్రయత్నమన్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More

Clickhere: వైస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాల్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోజా

You might also like