Saakshyam
Nothing scared but the truth

మహిళలను రెండు భాగాలుగా తెగనరికేయ్యాలి : కొల్లాం తులసి

0
Kollam Tulasi, sabarimala temple, ladies
దేశంలో అన్ని ఆలయాలలోకి మహిళలకు ప్రవేశం ఉంటుంది కాని పూర్వం నుండి ఒక్క శబరిమల కొండపైకి మాత్రం మహిలలకు ప్రవేశం ఉండదు, మగవారు మాత్రమే ఆ కొండ పైకి వెళ్లి దేవుని అఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ విషయంపై గత కొద్ది రోజుల నుండి దేశవ్యాప్తంగా చర్చలు జరిగుతున్నాయి. మహిళలకు కూడా శబరిమల ఆలయంలోకి అనుమతినివ్వాలి అంటూ సుప్రీం కోర్ట్ ని వేడుకున్నారు. దానికి గత కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్ట్ కూడా మహిళల ప్రవేశానికి అనుమతినిచ్చినట్లు ప్రకటన ఇచ్చింది. దీనికి కేరళ ముఖ్యమంత్రి కూడా స్పందించి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు ఇకపైన ఆడవారు కూడా శబరిమల ఆలయంలోకి వెళ్ళొచ్చు అంటూ అనుమతినిచ్చారు. కాని ఈ విషయంపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుప్రీం కోర్ట్ తీర్పుపై తిరగబడుతున్నారు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని ఇలా చెయ్యడం ఏమి బాలేదు అంటూ ఇచ్చిన హామీ వెనక్కి తీసుకోవాలి అంటూ కోపాన్ని ప్రదర్శించారు. అయిన కూడా సుప్రీంకోర్టు తన తీర్పు లో మార్పు తీసుకురాలేదు.
తాజాగా ఈ విషయంపై మరికొంతమంది మహిళలు సుప్రీం కోర్ట్ తీర్పు పై తప్పుబడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా  పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చంటూ సుప్రీం తీర్పు ఇచ్చినప్పటికీ తాము మాత్రం 50 ఏళ్లు దాటే వరకు ఆలయానికి వెళ్లబోమని తేల్చి చెప్పారు. 10-50 వయసులో శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టడం నేరమని భావిస్తున్నారు, 50 తరువాత కొండపైకి ఆడవాళ్ళకి ప్రవేశం కల్పించాలి అంటూ కొందరు మహిళలు కోర్టు మెట్లు ఎక్కారు. విచారించిన కోర్టు మహిళల ఆలయ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సుప్రీం తీర్పుపై మలయాళ ప్రముఖ నటుడు కొల్లాం తులసి(Kollam Tulasi) సంచలన వ్యాఖ్యలు చేశాడు. శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టే మహిళలను అడ్డంగా నరికి వెయ్యాలి అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి ఆడవారిని రెండు ముక్కలుగా నరికి ఒక భాగాన్ని ఢిల్లీకి పంపి, రెండో భాగాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పార్శిల్ చేయాలంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలపై నేట్టింట్లో విమర్శలు మొదలయ్యాయి. చూద్దాం ఈ యవ్వారం ఇంకెంత దూరం వెళ్తుందో…
You might also like