Saakshyam
Nothing scared but the truth

కొడంగల్ ఎన్నిక వాయిదా?

Kodangal election may postpone || Election News || Saakshyam

0

Kodangal election may postpone | Telugu political news | Saakshyam

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టుతో కొడంగల్ అట్టుడుకుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన మద్దతుదారులు రోడ్డెక్కారు. (Kodangal election may postpone) ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ అభిమాన నాయకుణ్ని వెంటనే విడుదల చేయకపోతే ప్రాణాలు తీసుకునేందుకూ వెనకాడబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చిరిస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమయంలో కొడంగల్ లో ఎన్నికల నిర్వహణ సరికాదని ఈసీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొడంగల్లో ఎన్నికను వాయిదా వేసే అవకాశాలను వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలా ఉద్రిక్తతలు నెలకొన్న నియోజకవర్గాల్లో ఎన్నిక వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కొడంగల్లోనూ ఎన్నికల వాయిదా తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి నేతలు రేవంత్ అరెస్టును తప్పుపడుతున్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఆయన్ను మహబూబ్ నగర్ కి తరలించినట్లు
చెబుతున్నప్పటికీ.. అందులో నిజమెంతో నిర్ధారణ కాలేదు. రేవంత్ ఆచూకీ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ పై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని.. ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. నిఘావర్గాల సమాచారం మేరకే తాము రేవంత్‌ రెడ్డిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలపగా.. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Kodangal election may postpone | Telugu news | Saakshyam

ఇంటెలిజెన్స్‌ సమాచారం నివేదిక ఆధారంగానే రేవంత్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా.. ఆ నివేదిక ఏంటో, దానిలో ఏముందో ఆ వివరాలను తమ ఎదుట ఉంచాలని ఆదేశిస్తూ అందుకు అరగంట సమయం ఇచ్చింది. ఆ గడువు అనంతరం మరోసారి విచారణలో రేవంత్‌ను ఈ సాయంత్రం 4.30గంటల తర్వాత విడుదల చేస్తామని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు తమకు సమయం కావాలని కోరారు. దీనికి సంబంధించిన ఆధారాలు రేపు సమర్పిస్తామని పోలీసులు గడువు కోరగా.. పోలీసుల తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయన అరెస్టు సక్రమంగా ఉంటే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ఈ రోజే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, కారణాలు తమకు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే మరో గంట సమయం ఇస్తామని పేర్కొంటూ.. విచారణను సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేసింది. పోలీసుల తరఫు న్యాయవాదిపై హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నేరుగా అడ్వొకేట్‌ జనరల్‌ వచ్చి వాదనలు విన్పించాలని ఆదేశించింది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:కాంగ్రెస్ తో కలవడానికి సిగ్గుందా చంద్రబాబు?

You might also like