Saakshyam
Nothing scared but the truth

నీలాంటి నీచుడు లేడంటూ చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్

Kodali Nani fires on Chandrababu | Telugu political news | Saakshyam

0

Kodali Nani fires on Chandrababu | Telugu political news | Saakshyam

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నీ గురించి, నీ బతుకు (Kodali Nani fires on Chandrababu) గురించి పిల్లనిచ్చిన మామే చెప్పాడని, నువ్వొక వెన్నుపోటుదారుడివని, నీ అంత నీచాతి నీచమైన వ్యక్తి ఎవరూ లేరని ఎన్టీఆరే చెప్పారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. నరేంద్ర మోడీ చంక నాలుగున్నరేళ్లు నాకారన్నారు. ఆయనంత గొప్ప ప్రధాని లేడని చెప్పారన్నారు. ఇప్పుడు తాము బీజేపీతో కలిశామని చెప్పడం విడ్డూరమన్నారు. నాలుగున్నరేళ్లు ప్రధాని నరేంద్ర మోడీకి మొక్కిన చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సూటుకేసులు మోస్తున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి తిడుతున్నా తమతో కలిసి రావాలని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

 

2014లో తమ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొనుగోలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు వారితోనే విమర్శలు చేయిస్తూ బహిరంగ లేఖ రాయించడం సిగ్గుచేటు అని కొడాలి నాని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారన్న టీడీపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ… ఈ పోటుగాళ్లు సంవత్సరానికి 365 రోజులు అసెంబ్లీకి వెళ్తున్నారా, బడ్జెట్ సెషన్ ఓ 20 రోజులు, శీతాకాలం, వర్షాకాల సమావేశాలు మరో పది రోజులు అన్నీ కలిసి మహా అయితే ముప్పై రోజులు వెళ్తున్నారన్నారు. కేవలం ఓ నెల రోజుల పాటు అసెంబ్లీకి హాజరై 365 రోజుల జీతాలను టీడీపీ నేతలు తీసుకుంటున్నారని కొడాలి నాని అన్నారు. టీడీపీ నేతలు నెల రోజుల జీతం మినహా మిగిలిన దానిని వెనక్కి ఇస్తారా అని ప్రశ్నించారు. అప్పుడు మేం అందుకున్న వేతనాలు కూడా తిరిగిస్తామన్నారు. అసెంబ్లీకి హాజరై జగన్ మాట్లాడితే మైక్ కట్ అవుతుందన్నారు. రోజా, తనలాంటి వారు గట్టిగా నిలదీస్తే ఒకట్రెండేళ్లు సస్పెండ్ చేస్తారన్నారు. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు వస్తాయని, అడ్డమైన వాళ్ల దగ్గరకు వెళ్లి సమాధానాలు చెప్పేలా చేస్తారన్నారు. కోడెల శివప్రసాద్ రావు సభాపతిగా ఉన్నంత కాలం తాము సభకు వెళ్లమని చెప్పారు.

 

Kodali Nani fires on Chandrababu | Telugu political news | Saakshyam

జన్మభూమి కార్యక్రమం తీరు, జగన్ పైన టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. తమ పార్టీ అధినేతపై టీడీపీ విమర్శలలో పస లేదని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వస్తే దించలేమని చంద్రబాబుకు తెలుసునని అన్నారు. గతంలో వైయస్ పైన, ఇప్పుడు జగన్ పైన చంద్రబాబు తన ఎల్లో మీడియాతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారన్నారు. అతి పెద్ద నీతీ మళ్ళిన రాజకీయ నాయకుడు అంటే ముందుగా చంద్రబాబు నాయుడు పేరే  కనిప్పిస్తుంది అని నాని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పరువు అంత తీసుకున్న చంద్రబాబు మళ్ళీ ఏపీ లో కూడా అదేవిధంగా పరువు తీసుకుంటారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకి తగిన బుద్ధి చెబుతారని, ఇక టీడీపీ పార్టీ ఏపీ లో కనబడదని కోడలి నాని తెలిపారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like