Saakshyam
Nothing scared but the truth

లోకేష్ కి సీఎం అయ్యే సీన్ ఉందంట..!

Kesineni Nani comments on Nara lokesh | Telugu political news | Saakshyam

0

Kesineni Nani comments on Nara lokesh | Telugu political news | Saakshyam

ఏపీ ప్రభుత్వం లో మంత్రి అయిన నారా లోకేశ్ కు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. పార్టీ అధినేత  చంద్రబాబు  కుమారుడు కావడం అందులో అన్నింటి కంటే (Kesineni Nani comments on Nara lokesh) అతి పెద్ద ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఆధారంగానే ప్రత్యక్ష ఎన్నికల్లో ఏమాత్రం అనుభవం లేకున్నా, శాసన మండలిలోకి అడుగు పెట్టడమే కాకుండా, ఆ మరుక్షణమే మంత్రిగానే పదవీ బాధ్యతలు చేపట్టేశారు. అయితే చంద్రబాబు కుమారుడుగా ఉన్న లోకేష్ రాజకీయ ఎంట్రీ చడీచప్పుడు లేకుండా ఇలా దొడ్డిదారిలో జరిగిపోయిందా అన్న విషయం పై పెద్ద ఎత్తున విమర్శలతో పాటు విశ్లేషణలు సాగాయి.  అయితే అప్పటిదాకా చాల సార్లు తన పార్టీని ముంచేలా చాలా సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన చినబాబు పార్టీ శ్రేణులకు బిగ్ షాక్ ఇచ్చేవారు. అయితే ఎమ్మెల్సీగా, మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా లోకేశ్ తన తీరు మార్చుకుని తన సత్తాను పెంచుకునే యత్నం చేస్తారులే అని తెలుగు తమ్ముళ్లు ఆశించారు. అయితే వారి ఆశలను అడియాశలు చేస్తూ చినబాబు నా తీరింతే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రసంగాలత్లో మరింతగా దిగజారిపోయాడు లోకేశ్. అయితే ఇపుడు తెలుగు తమ్ముళ్లు మా చినబాబుకు సీఎం అయ్యే సత్తా ఉంది అంటూ రాగాలు తీయడం ప్రారంభించేశారు.

 

Kesineni Nani comments on Nara lokesh | Telugu political news | Saakshyam

కేశినేని నాని ఇప్పుడు చినబాబును ఆకాశానికెత్తేస్తూ ప్రకటనలు గుప్పించడం ప్రారంభించేశారు. ఈ స్తుతి కీర్తనలు ఎంతదాకా వెళ్లాయంటే మంత్రిగానూ తనను తాను ప్రూవ్ చేసుకోలేని నారా లోకేశ్ లో ఏకంగా సీఎంగా సత్తా చాటే లక్షణాలున్నాయని చెప్పేదాకా. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ కు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అర్హత నూరు శాతం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి లోకేష్ అహర్నిశలూ శ్రమిస్తున్నారని సెలవిచ్చిన ఆయన ఇంతకీ లోకేష్ పరిష్కరించిన సమస్యలేమిటనేది మాత్రం చెప్పలేదు.  శ్రమపడకుండానే మంత్రి పదవి దక్కించుకున్న లోకేష్ తన సామర్థ్యాన్ని రాష్ట్ర ప్రజల ముందు నిరూపించుకోవాల్సి ఉంది.  వివరణ, ఆధారాలు ఉండని ఈ తరహా ఎలివేషన్ సీన్స్ చూసినప్పుడే ఒక్క చంద్రబాబు మీద మాత్రమే కాకుండా మొత్తం టీడీపీ నేతలందరిపైనా ఈ రుద్దుడు కార్యక్రమం భాద్యతలు ఉన్నాయనిపిస్తుంది. ముందు అసలు ఎమ్మెల్యే గా గెలుస్తాడో లేదో అని రాష్ట్ర ప్రజలు అనుకుంటుంటే, భజన బ్యాచ్ సభ్యులు అపుడే ముఖ్యమంత్రి అంటూ డప్పు కొడుతున్నారు. ఎలాగైతేనేం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ ను టీడీపీలో, ప్రజలపైనా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like