Saakshyam
Nothing scared but the truth

మల్కాజిగిరి నుంచి పోటీ చేయనున్న మాజీ ఐఎఎస్

Kcr wants Rajiv Sharma to contest from Malkajgiri | Telugu political news | Saakshyam

0

Kcr wants Rajiv Sharma to contest from Malkajgiri | Telugu political news | Saakshyam

మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా రిటైర్డ్ ఐఎఎస్ అదికారి, మాజీ సీఎస్, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజీవ్‌ శర్మను (Kcr wants Rajiv Sharma to contest from Malkajgiri) పోటీ చేయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అయిన ఆయన.. గతంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు. ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు.. పార్టీకి బాగా ఉపయోగపడతాయని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. సిట్టింగుల్లో అత్యధిక మందికి సీట్లు ఇస్తామంటూ కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ.. కనీసం ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అక్కడి నుంచి రాజీవ్‌శర్మను బరిలోకి దింపేందుకు కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఇదే సీటుపై కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి కూడా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఉప్పల్‌ ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడ్డ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మెహన్‌ సైతం మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

 

Kcr wants Rajiv Sharma to contest from Malkajgiri | Telugu news | Saakshyam

తెలంగాణలోనే విద్యావంతులు ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాజీవ్ శర్మను ఎంపీగా నిలబెట్టేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ గతంలో ఎంపీగా చేసిన మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. పోటీలేని ఈ స్థానంలో రాజీవ్ శర్మను ఎంపీని చేసి ఢిల్లీకి పంపాలని కేసీఆర్ యోచిస్తున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో మల్కాజిగిరి నుంచి రాజీవ్ శర్మ గెలుపు సులువే. అక్కడ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ నేతలే కావడంతో ఈజీగా గెలుస్తారు. తద్వారా ఢిల్లీలోనే రాజీవ్ శర్మను ఉంచి తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులు నిధులు రాబట్టేందుకు ఈ అస్త్రాన్ని కేసీఆర్ బయటకు తీయబోతున్నట్టు సమాచారం.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like