Saakshyam
Nothing scared but the truth

ఇది నిజంగానే సిగ్గుసేటు…నాలిక తెగ్గోసుకునేంత అభిమానమా..?

0

ఇప్పటివరకు మనం సినిమా హీరోలా కోసం గొడవలు పడడం చేతులు కోసుకోవడం ఒకరిపియన్ ఒకరి కత్తులు దూసుకోవడం లాంటివి చాలా చూసాం అదంతా హీరోల పైన ఉన్న అభిమానం సినిమాల పైన ఉన్న మక్కువ అని తెలుసు, కాని అలాంటి అభిమానం రాజకీయాల్లో కూడా ఉంది అంటే అది నిజంగానే అచ్చర్యంగా ఉంది. సినామాలకు రాజకీయాలకు చాలా తేడా ఉంది కాని ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ట్రెండ్ ఎక్కువగా రాజకీయాల్లో నడుస్తుంది రాజకీయ నాయకుల కోసం కొంతమంది ప్రణాల సైతం లేక్కచేయ్యడం లేదని తెలుస్తుంది. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రతి ఒక్కరు కూడా తన నాయకుడి పైన విపరీతంగా మక్కువ పెంచుకుంటున్నారు ఆ అభిమానం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే నాలుక కోసుకొనే వరకు వెళ్తుంది. అసలు మ్యాటర్ ఏంటో వివరాల్లోకి వెళ్తే…అతను చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా? రాజకీయాల పైన ఉన్న మక్కువతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉన్న అభిమానం తో ఏకంగా ‘నాలికని తెగ్గోసుకుని.. దేవుడి హుండీలో వేయడం’ కలకలం సృష్టించింది.

సరిగ్గా, ఎన్నికల ప్రచారం తెలంగాణలో ముగిసిన సమయంలో.. ఈ ఘటన వెలుగులోకి రావడం ఆశ్చర్యకరమే. అసలు విషయాలు సేకరిస్తే పచ్చిమ గోదావరి జిల్లాకు మువకుడిగా గుర్తించారు ఇతను వెర్రి ఏంటో గాని రాజకీయాలకోసం తన నాలుకను తెగ్గోసుకుని ఒక సంచలనాన్ని సృష్టించాడు. అయిత ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆచర్యానికి లోనయ్యారు ఇది నిజంగానే అభిమానమా? లేకా ఇందులో ఇంకేదైనా కోణం ఉందా? అన్న డౌట్ వస్తే అది మీ పొరపాటు కానే కాదు, ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు జరగడం కామన్ గానే జరుగుతూ ఉంటాయి కాని ఇతను చేసిన ఈ పని మాత్రం కాస్తా కొత్తగానే అనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు రాజకీయాలకోసం ఆందోళనలు, నిరసనల సందర్భంగా కార్యకర్తలు ఒంటికి నిప్పంటించుకోవడం.. ప్రాణాలు కోల్పోవడం లాంటివి చాలానే జరిగాయి కాని తమ అభిమాన నేతల కోసం ఇలా నాలిక తెగ్గోసుకోవడమేంటి.? ఇదంతా చూస్తుంటే అభిమానం అన్నట్లుగా లేదు మరోలా అనిపిస్తుంది. చూద్దాం ఈ విషయం పై ఎలాంటి నిజాలు బయటకి వస్తాయో…

You might also like