Saakshyam
Nothing scared but the truth
Page Right

కర్త కర్మ క్రియ రివ్యూ అండ్ రేటింగ్…!!

Kartha Karma Kriya Movie Rating And Review || Cinema Updates

0

Kartha Karma Kriya Movie Updates || Saakshyam Latest Cinema Updates

నటీనటులు : వసంత్ సమీర్, సెహర్, కాదాంబరి కిరణ్ , రవి వర్మ, చంద్రమహేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు.

దర్శకత్వం : నాగు గవర

నిర్మాత : చదలవాడ పద్మావతి

సంగీతం : శ్రవణ్ భరద్వాజ్

స్క్రీన్ ప్లే : నాగు గవర

నాగు గవర దర్శకత్వంలో వసంత్ సమీర్, సెహర్ జంటగా నటించిన చిత్రం ‘కర్త క్రియ కర్మ’(Kartha Karma Kriya Movie Updates). కాగా శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ చిత్రం, ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

Kartha Karma Kriya Movie Updates || Latest cinema updates

క‌థ‌:
జూబ్లీ హిల్స్‌లో ఓ సెల్‌ఫోన్ కంపెనీలో మొబైల్ మెకానిక్‌గా ప‌నిచేస్తుంటాడు సిద్ధు(వ‌సంత్ స‌మీర్‌). స్నేహితుడు యాదు ప‌నిచేసే హోండా షోరూంకి వెళ్లిన సిద్ధుకి మైత్రి(సెహ‌ర్ అఫ్సా)ప‌రిచ‌యం అవుతుంది. ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు సిద్ధు. ఆమెతో ప‌రిచ‌యం పెంచుకుంటాడు. వీరి క‌థ ఇలా సాగుతుండ‌గా మైత్రి అక్క‌య్య దివ్య త‌న చావుకు ఎవ‌రూ కార‌ణం కాదంటూ లెట‌ర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుంటుంది. ఆమెతో పాటు మ‌రో ముగ్గురు కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోతారు. పోలీస్ అధికారులు ఆ కేసును క్రైంబ్రాంచ్‌కి చెందిన ర‌వితేజ‌(ర‌వివ‌ర్మ)కి అప్ప‌గిస్తారు. ర‌వి వ‌ర్మ కేసుని డీల్ చేసే క్ర‌మంలో మైత్రిని క‌లిసి వివ‌రాలు సేక‌రిస్తాడు. అక్క‌డే ఉన్న సిద్ధుని క‌లుస్తాడు. అలాగే దివ్య ల‌వ‌ర్ ఆనంద్‌(శ్రీహ‌ర్ష‌)పై అనుమాన‌ప‌డ‌తాడు. అయితే కేసుని విచారించే క్ర‌మంలో అత‌నికి అనుకోని నిజాలు తెలుస్తాయి. వీరికి ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌కు సిద్ధుకి ఓ లింక్ ఉంద‌ని ర‌వితేజ తెలుస్తుంది. అది ఎంత వ‌ర‌కు నిజం? ముగ్గురు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు? చివ‌ర‌కు సిద్ధు, మైత్రి ల‌వ్ స‌క్సెస్ అయ్యిందా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్:

* వసంత్ సమీర్ లుక్స్ అండ్ ఫిజిక్
* క్లైమక్ష్ సన్నివేశాలు
* రవి వర్మ ఇన్వెస్టిగేట్

మైనస్ పాయింట్స్ :

* స్లో నారేషన్
* లాజిక్ లేని కధ
* స్క్రీన్ ప్లే

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు నాగు గవర స్టోరీ లైన్ మంచిదే తీసుకున్నప్పటికీ, ఆ లైన్ ని ఎలివేట్ చేసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు. సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి. అయితే ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం సన్నివేశాల అవసరానికి మించి.. అనవసరమైన బిల్డప్ మ్యూజిక్ తో సాగుతుంది.ఇక కెమెరా బాధ్యతలను నిర్వహించిన దుర్గాకిషోర్ బోయిదాపు కెమెరా వర్క్ పర్వాలేదు. స్టేడియంలో హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకునే సన్నివేశం లాంటి కొన్ని సన్నివేశాల్లో ఆయన పనితనం ఆకట్టుకుంటుంది.ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగాలేదు. చాలా చోట్ల స్లో మోషన్ షాట్స్ ను ఆయన మరి స్లో గా కట్ చేసినట్లు అనిపిస్తోంది. నిర్మాత చదలవాడ పద్మావతి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

సాక్ష్యం రేటింగ్ : 2.5/5

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Read Another : అదుగో రివ్యూ అండ్ రేటింగ్…!

You might also like