Saakshyam
Nothing scared but the truth

నిజంగానే పవన్ కి తిక్క ఉంది కానీ ఆ తిక్కకే లెక్కేలేదు…

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ఇప్పుడు కొత్తగా చెప్పుకోనవసరం లేదు ఆ సినిమాలోని డైయలగ్స్ కూడా అదే రేంజ్ లో పేలాయి. అందులో ఒక డైయలగ్ మాత్రం ఇప్పటికి ఎప్పటికి ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఆ డైయలగ్ ఏంటో మరొకసారి బొమ్మేసుకుంటే నాకు ఒక తిక్కుంది ఆ తిక్క కోక లేక్కుంది అని చెప్పిన డైయలగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కే వర్తిస్తుంది. అవును నిజమగానే పవన్ కళ్యాణ్ కి తిక్కుంది అంటూ ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదో చెయ్యాలని కలలు కంటున్నారు ఆ కలలన్ని కూడా జస్ట్ పగటి కలలే అని అయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఉదయం చేసిన పనులెవి సాయంత్రానికి గుర్తుండవని ఆ పనులన్నీ కూడా సాయంత్రం అయితే మర్చిపోతారని విమర్శించారు. ప్రత్యెక హోదా పోరాటం విషయంలో పవన్ మాట తప్పారని ఆరోపించారు.

అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గోట్లూరులో ఈరోజు నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అదే నేపధ్యంలో మీడియాలో మాట్లాడుతూ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కోసం అలాగే ప్రత్యేక హోదా కోసం ఎక్కడి వరకైనా వెళ్తాను ఏదైనా చేస్తాను కావాలంటే ఢిల్లీ కూడా వెళతాను అని వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఆ విషయం పై నోరు మెదపలేదు ఢిల్లీ కూడా వెళ్ళలేదు అని ఆయన గుర్తు చేశారు. చేతిలో మైక్ ఉన్నప్పుడు ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడుతారు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా చేసారని వ్యాఖ్యానించారు. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మరోసారి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి తిక్కుందని ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.

You might also like