Saakshyam
Nothing scared but the truth

ఇండియన్ 2 లో కమల్ సరసన కాజల్?

Kajal to act with Kamal Hasan in Indian 2

0

Kajal to act with Kamal Hasan in Indian 2 | Telugu cinema news

2.ఓ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రాన్ని కమల్ హాసన్ తో చేస్తున్న (Kajal to act with Kamal Hasan in Indian 2) విషయం తెల్సిందే. భారతీయుడుకు సీక్వెల్ గా ఇండియన్ 2 అనే టైటిల్ తో ఆ చిత్రం రూపొందబోతుంది. కమల్ కు జోడీగా మొదట నయనతారను అనుకున్నారు. ఆమె డేట్లు మరియు పారితోషికం ఇబ్బందిగా మారడంతో ఆమె స్థానంలో కాజల్ ను ఎంపిక చేసినట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

Kajal to act with Kamal Hasan in Indian 2 | Telugu film news

కాజల్ కొత్త హెయిర్ స్టైల్ కు మారబోతున్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట. కాజల్ హెయిర్ డ్రస్ కోసం అమెరికా నుండి నిపుణులను రప్పిస్తున్నట్లుగా కూడా తమిళ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. శంకర్ కథ పూర్తిగా చెప్పకుండానే కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శంకర్ దర్శకత్వంలో చిన్న పాత్రను చేయాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది కాజల్ కు హీరోయిన్ ఛాన్స్ వస్తే కథ ఏంటీ అని కూడా అడుగుతుందా చెప్పండి. మొత్తానికి కాజల్ ఇండియన్ 2 లో ఫిక్స్ అయినట్లే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 న మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు . ఈ సినిమా షూటింగ్ ని రాయలసీమ, టైవాన్ , చెన్నై లో రూపొందించాలని ప్లాన్ చేశారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:పట్టాలెక్కనున్న నాని విక్రమ్ మూవీ

You might also like