Saakshyam
Nothing scared but the truth

మోసంలో బాబుకు పీహెచ్ డీ

Jaganmohan Reddy slams Chandrababu | Telugu political news | Saakshyam

0

Jaganmohan Reddy slams Chandrababu | Telugu political news | Saakshyam

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన సందర్బంగా ఇచ్ఛాపురంలో విజయ సంకల్ప స్థూపాన్ని జగన్ ఆవిష్కరించారు. బహిరంగ (Jaganmohan Reddy slams Chandrababu) సభా వేదిక నుంచి పాతయాత్రలో చివరి ప్రసంగం చేసిన జగన్, తనను వెన్నంటి నడిచిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు పాలనను ప్రశ్నిస్తూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించిన జగన్ అసలు చంద్రబాబు పాలనపై జనం ఏమనుకుంటున్నారన్న విషయాన్ని కూడా జగన్ తనదైన రీతిలో చెప్పారు. పాదయాత్రలో జనం సమస్యలను దగ్గర నుంచి చూశానని చెప్పిన జగన్, బాబు పాలనను చూసిన జనం… నిను నమ్మం బాబూ అని అంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నోరు తెరిస్తే నదుల అనుసంధానం అంటారని, పట్టిసీమ నీళ్లు రాయలసీమకు ఇచ్చామని చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు.

 

రెయిన్ గన్ లతో కరువును పారద్రోలామని చెబుతారని కూడా జగన్ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా తన పాదయాత్రలో అనంతపురంలో తనను కలిసిన ఓ రైతు గురించి జగన్ ప్రస్తావించారు. తన పర్యటనలో శివన్న అనే రైతును కలిశానని, తన పొలంలో వేరుశనగ వేసినట్లు చెప్పాడని, పంట ఎలా ఉందని అడిగితే చంద్రబాబు రాగానే కరువు వచ్చిందని చెప్పాడన్నారు. అనంతపురంలో చంద్రబాబు పర్యటనకు వచ్చినప్పుడు సాయం అడిగామని చెప్పాడని… అప్పుడు చంద్రబాబు అయ్యో కరువు వచ్చిందా అంటూ అధికారులను తిట్టాడని… ఆ డ్రామాలో మరో అడుగు ముందుకేసి రెయిన్ గన్ డ్రామా ఆడారని జగన్ విమర్శించారు. రెయిన్ గన్ల పేరుతో చంద్రబాబు సినిమా చూపించారని చెప్పారు. ఇక చంద్రబాబుతో మనకు సావాసం వద్దబ్బా అని ఆ రైతు తనతో చెప్పారని జగన్ వివరించారు. చివరగా నిన్ను నమ్మను బాబూ అని ఆ రైతు సహా ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారని జగన్ అన్నారు.

 

ఆ తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలపై స్పందించిన జగన్, ఆయా రాష్ట్రాలకు వెళ్లి చంద్రబాబు ఏం చేశారన్న విషయాన్ని ప్రస్తావించి నవ్వులు పూయించారు. బెంగళూరులో కుమారస్వామితో చంద్రబాబు కాఫీ తాగుతారని, కానీ పక్కనే ఉన్న అనంతపురంలో కరువు వచ్చినా బాబు పట్టించుకోరని జగన్ విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పి… చెన్నై వెళ్లి స్టాలిన్ ను కలుస్తారని. అక్కడ ఇడ్లీ  సాంబర్ తింటారని, కానీ ఆ పక్కనే ఉన్న తన సొంత జిల్లా చిత్తూరు గురించి ఆలోచించరని సెటైర్ వేశారు. ప్రభుత్వ ఖర్చే కాబట్టి జాతీయ రాజకీయాలు అంటూ విమానాలు ఎక్కి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ వద్దకు చంద్రబాబు వెళ్తారని జగన్ ఎద్దేవా చేశారు. కోల్ కతా వెళ్లి మమతతో చంద్రబాబు చికెన్ తింటాడని ఆరోపించిన జగన్… రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉంటే ఈయన జాతీయ రాజకీయాలు చేస్తాడట అని మండిపడ్డారు.

 

Jaganmohan Reddy slams Chandrababu | Telugu news | Saakshyam

చంద్రబాబు హయాంలో విద్యారంగం భ్రష్టుపట్టిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు ప్రభుత్వ స్కూల్స్ మూసివేయించిందని ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్ని ఖాళీలు ఉన్నా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం సరిగా లేక పిల్లలు అల్లాడుతున్నారన్నారు. నాసిరకం దుస్తులు పంపిణీ చేస్తున్నారని జగన్ మండిపడ్దారు. ఇప్పటికీ పుస్తకాలు సరిగ్గా పంపిణీ చేయలేదన్నారు. చంద్రబాబు పాలన చూస్తుంటే ఆందోళన కలుగుతోందని, నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనలో యువత నిరాశలో కూరుకుపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

గడచిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో 650 హామీలు పెట్టి మోసం చేశాడని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు వచ్చాక రాష్ట్రంలో ఓ వైపు కరువు తాండవిస్తే, మరోవైపు విపత్తు విలయం చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేవన్నారు. చంద్రబాబు వచ్చాడు కానీ.. ఉద్యోగాలు రలేదన్నారు జగన్. అసలు బాబు జమానాలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా లేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులనూ ప్రస్తావించిన జగన్, వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకొని వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మనకు ఇంకా అవసరమా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తారన్నారని జగన్ మండిపడ్డారు. మోసం చేయడంలో బాబుకి పీహెచ్ డీ ఇచ్చిన తక్కువే అన్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like