Saakshyam
Nothing scared but the truth

ఎంపీ కొత్తప‌ల్లి గీతకు నో చెప్పిన జ‌గ‌న్

Jagan says no to Araku MP Kothapalli Geetha | Telugu political news | Saakshyam

0

Jagan says no to Araku MP Kothapalli Geetha | Telugu political news | Saakshyam

అరకు ఎంపీ కొత్తపల్లి గీతకి వైస్సార్సీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ గుర్తు పై గెలిచిన ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత ఆ త‌ర్వాత అధికార (Jagan says no to Araku MP Kothapalli Geetha) టీడీపీలోకి వెళ్ళిరు. అయితే టీడీపీలోని నాయకులు గీతకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అంద‌లం ఎక్కించిన పార్టీనే కాద‌ని, జంప్ అయిన కొత్త‌ప‌ల్లి గీత ఇప్పుడు తెగ బాధ‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఎందుకంటే వ‌చ్చే చంద్ర‌బాబు చేయించిన ఇన్న‌ర్ స‌ర్వేలో వైసీపీ నుండి ఫిరాయించిన వారికి నెగిటీవ్‌గా రిపోర్ట్ వ‌చ్చిందంట‌. దీంతో వారిలో ఇద్ద‌రు ముగ్గురు త‌ప్పిస్తే మిగ‌తా వారికి బాబు మొండిచెయ్యి చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

 

Jagan says no to Araku MP Kothapalli Geetha | Telugu political news | Saakshyam

ఈ నేప‌ధ్యంలో రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై ఆలోచ‌న‌లో ప‌డిన కొత్తప‌ల్లి గీత టీడీపీలోనే ఉంటే త‌న రాజ‌కీయ‌భ‌విష్య‌త్తు మొత్తం గంగ‌లో క‌లిసిపోతుంద‌ని, ఎలాగూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదని భావించిన గీత, ఆమె పార్టీలోకి మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. దీంతో గీత మ‌ళ్ళీ వైసీపీలో చేరేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వైసీపీ ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చించార‌ని, ఆ విష‌యం జ‌గ‌న్ వ‌ద్ద‌కు కూడా వెళ్ళ‌డంతో, జగన్ ఎలాంటి ఆలోచన లేకుండా కొత్త‌ప‌ల్లి గీత‌ను మ‌రోసారి పార్టీలో చేర్చుకునే అవ‌కాశంలేద‌ని తేల్చిచెప్పార‌ని స‌మాచారం. తనకు గెలిపించిన పార్టీని, ప్రజలను గీత మోసం చేసిందని, విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త లేని వారికి వైసీపీలో చోటు లేద‌ని, త‌నకు ప్ర‌జ‌లపై న‌మ్మ‌కం ఉంద‌ని, ప్ర‌జ‌ల‌కు కూడా త‌నపై న‌మ్మ‌కం ఉంద‌ని, దాన్ని తాను పోగొట్టుకోవ‌డానికి తాను సిద్ధంగా లేన‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారని సమాచారం.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like