Saakshyam
Nothing scared but the truth

చేతి కట్టు తీసి గట్టున పెట్టి రాబోతున్న జగన్…

0

YS Jagan, Prajasankalpa Yatra, Pawan kalyan

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికి పాదయాత్ర మొదలు పెట్టి 294 రోజులు అవుతుంది అనుకున్న విధంగా 3,211 కిలోమీటర్లు నడిచారు మొత్తం 11 జిల్లాలను కవర్ చేశారు ఇక మిగిలి ఉంది ఒక్కటి మాత్రం ఇంతలో జగన్ పై ఎవరు ఊహించని విధంగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో దాడి జరిగింది ఆ దాడిలో జగన్ ఎడమవైపు చేతికి తీవ్ర గాయం తగిలింది మూడు కుట్లు కూడా పడ్డాయి. ఇదంతా జగన్ పైన కావాలనే కుట్ర పన్నారు అన్న విషయం అందరికి తెలిసినదే ఎందుకంటే జగన్ పాదయాత్ర చెయ్యడం పాదయాత్ర లో భాగంగా జగన్ ని జనాలు బ్రమ్మరధం పట్టడం, ఈ నేపధ్యంలో జగన్ కి వస్తున్నా మైలేజ్ ని చూసి అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోయారు దాంతో ఎలాగైనా సరే జగన్ పాదయాత్ర కి బ్రేక్ వెయ్యాలని చూసారు. కాని ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన ఎన్ని జిత్తులు మారి పనులు చేసిన కూడా జగన్ ప్రజాసంకల్ప యాత్ర ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. అయితే జగన్ కి కుట్లు పడడంతో అతనికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పగా దానికి జగన్ ససేమెర ఒప్పుకోలేదు, తన పాదయాత్రని కంటిన్యూ చెయ్యాలని కోరారు,కానీ అయన పరిస్థితి అంత మెరుగుగా లేకపోవడం తో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.

అయితే ఇన్ని రోజులు ఎప్పుడు జగన్ విశ్రాంతి తిసుకోలేదు తన యాత్రకి ఇన్ని రోజులు విరామం ఇవ్వలేదు ఎప్పుడు కూడా శుక్రవారం హైదరబాద్ వెళ్లి కోర్ట్ కి హాజరవ్వడం కోసం విరామం ఇచ్చేవారు కాని ఈసారి దాదాపు 10 రోజులు విరామం ఇచ్చారు. తన పాదయాత్రకి ఇన్ని రోజులు విరామం ఇచ్చిన కూడా జగన్ ఆ సమయాన్ని వృదా చెయ్యకుండా ఆ సమయాన్ని వ్యక్తిగతంగా కంటే రాజకీయంగా సద్వినియోగం చేసుకుంటున్నారని, వ్యూహ నిర్మాణంలో బిజీగా వున్నారని చెబుతున్నారు. జగన్ తన పాదయాత్రలో ఇప్పటివరకు 11 జిల్లాల్లో 122 అసెంబ్లీ నియోజకవర్గాల్ని చుట్టబెట్టారు. 113 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇక ఇప్పుడు మిగిలిన ఈ చివరి అంకమే పాదయాత్రలో కీలకమన్నది వైసీపీ భావన. అందుకే..

ఈ లాస్ట్ ఫేస్‌ని ‘దిగ్విజయంగా’ ముగించడం కోసం ప్రత్యేక ప్రణాళిక తయారుచేసుకునే పనిలో వుంది పార్టీ వ్యూహకర్తల మండలి. ఇక ఇదే సమయంగా భావించి పవన్ కళ్యాణ్ జగన్ లేని టైం లో తన పార్టీ ని ప్రచారం చేసుకొనే పనిలో పడ్డారు. దాంతో పవన్ కళ్యాణ్ కి జనాలు దగ్గరౌతున్నారు, ఈ నేపధ్యంలో జగన్ ఇంకా తన యాత్రకి విరామం ఇస్తే పవన్ దుకుడిని ఓవర్‌టేక్ చేయడమెలాగన్నదే ఇప్పుడు జగన్ వెతుకుతున్న కొత్త స్ట్రాటజీ. అందుకే దీపావళి మరుసటి రోజు అంటే 8 వ తారీకు నుండి జగన్ (YS Jagan) తన పాదయాత్రని మొదలి పెట్టాలి అని భావిస్తున్నారట. అయితే ఇక్కడ కూడా జగన్ కి ఒక చిక్కు ఎదురయ్యింది అదేమిటంటే చేతికి కట్టు వుంచడమా.. తియ్యడమా? ఇప్పటికి జగన్ కి ట్రీట్మెంట్ పూర్తీ అయిపొయింది, బోన్ ఫ్రాక్చర్ లాంటి సమస్యలేవీ లేకపోవడంతో.. ఇక కట్టుతో అవసరం లేదని డాక్టర్లు చెప్పేశారు. దాంతో జగన్ చేతి కట్టు తీసి గట్టున పెట్టి.. గాయమైన చోట భుజానికి బ్యాండ్ వేయించుకుని వస్తారట! ఇది జగన్ అంటే…

Click here : టిడిపికి షాక్ .. వైసిపిలో చేరిన కీలక నేతలు …

You might also like