Saakshyam
Nothing scared but the truth

విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

Jagan inaugurates Vijaya Sankalpa Sthupam in Ichapuram | Telugu political news | Saakshyam

0

Jagan inaugurates Vijaya Sankalpa Sthupam in Ichapuram | Telugu political news | Saakshyam

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. 6 నవంబర్ 2017లో ఇడుపులపాయలో ప్రారంభమైన (Jagan inaugurates Vijaya Sankalpa Sthupam in Ichapuram ) జగన్ పాదయాత్ర 9 జనవరి 2018న ఇచ్ఛాపురంలో ముగిసింది. చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్‌)ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో గుర్తుగా పైలాన్‌ను ఆవిష్కరించారు. విజయస్థూపం పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. మూడంతస్తులుగా స్థూపం దీనిని నిర్మించారు.భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. వైఎస్‌ జగన్‌ పైలాన్‌ను ఆవిష్కరించే దృశ్యాన్ని అపురూపంగా తిలకించారు. పైలాన్‌ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

 

Jagan inaugurates Vijaya Sankalpa Sthupam in Ichapuram | Telugu political news | Saakshyam

అంతకు ముందు వైఎస్‌ జగన్‌ పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. పైలాన్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి కిలో మీటర్ల మేర వైసీపీ అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది. జగన్ రాకముందే ప్రాంగణం నిండిపోయింది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like