Saakshyam
Nothing scared but the truth
Page Right

దుష్ట శక్తుల మీద సాధించిన విజయం ఇది – జగన్

Jagan Diwali Wishes to Telugu People | Today news | Saakshyam

0

Jagan, Diwali Wishes, Telugu People

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్(Jagan) మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్నది. అంతేగాక దీపావళి పర్వదినాల్లో తన యాత్ర దిగ్విజయంగా కొనసాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పర్వదినం విశిష్టతను గురించి పేర్కొంటూ ‘చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకయే దీపావళి అంటూ పండుగ ప్రాముఖ్యతను గురించి చెప్పారు. ప్రతి ఇంట్లో ఈ దీపావళి పర్వదినాన ఆనందాల కాంతి కాంతులు నింపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

తన తండ్రి ఆశయాల సాధన కోసం తానూ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ఎన్నో దుష్టశక్తులు అడ్డుపడ్డాయని, ప్రజల్లో తనకు వస్తున్నా ఆదరణను చూసి ఓర్వలేక చివరికి జగన్ మోహన్ రెడ్డిని ఈ భూమ్మీదే లేకుండా చేయాలనీ పన్నిన పన్నాగాలన్నిటిని అధిగమించి మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో ఎదురొడ్డి పోరాడి ప్రజల జీవితాల్లో ఆనందాల కాంతులు నింపి ప్రతినిత్యం దీపావళి పర్వదినంలా పండుగ కాంతులు వారి జీవితాల్లో వెదజల్లాలని ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో తమ నేతను గెలిపించి రాజన్న రాజ్యాన్ని సాధిస్తామని ప్రజలు ముక్తకంఠంతో జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వగతం పలుకుతూ ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేస్తున్నారు.

Click here : దుష్ట శక్తుల మీద సాధించిన విజయం ఇది – జగన్

You might also like