Saakshyam
Nothing scared but the truth

సంచలనంగా మారిన జగన్ ప్రకటన

Jagan announced that he will carved out 25 new districts | Telugu political news | Saakshyam

0

Jagan announced that he will carved out 25 new districts | Telugu political news | Saakshyam

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంచలన ప్రకటన చేశారు. జనం (Jagan announced that he will carved out 25 new districts ) పడుతున్న ఇబ్బందులు వారికి ఎదురవుతున్న సమస్యలను దగ్గరగా చూసిన అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన జగన్, ఆ సమస్యల పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలపైనా తనకు సంపూర్ణ అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఇక పాదయాత్రలో భాగంగా ఇప్పటికే ఆయా సమస్యలపై ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలను జగన్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఇక ఇచ్ఛాపురం బహిరంగ సభా వేదికపై నుంచి తన ప్రణాళికలపై స్ప్రష్టమైన ప్రకటన చేసిన జగన్ రాష్ట్రంలో, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజిస్తానని జగన్ చెప్పారు. పాలనను సులభతరం చేసేందుకు అవసరమైన కీలక అంశాన్ని జగన్ ప్రస్తావించారు.

 

ప్రజలకు సుపరిపాలన అందాలన్న ఏకైక లక్ష్యంతో కొత్త జిల్లాల ప్రకటన చేశారని చెప్పాలి. అది కూడా తన పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించారంటే, దానిపై ఇప్పటికే జగన్ కసరత్తు పూర్తి చేసి ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. చిన్న జిల్లాలతో ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే అంతిమ లక్ష్యంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సభలో జగన్ తాము అధికారంలోకి వచ్చాక ప్రతీ పార్లమెంటును ఓ జిల్లాగా చేస్తానని జగన్ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలను 25 జిల్లాలుగా విభజించి, 25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్ ను  నిర్మిస్తానని ఆయన చెప్పారు. తద్వారా కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు దగ్గరగా చేస్తానని జగన్ చెప్పారు.

 

Jagan announced that he will carved out 25 new districts | Telugu political news | Saakshyam

ఇక అన్ని గ్రామాల్లో, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యం వస్తుందన్నారు. ప్రతి పథకం పేద వాడి ఇంటివద్దకే వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా కేవలం అర్హత మాత్రమే చూస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలో యాభై ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియ‌మిస్తామ‌ని, వారికి ఐదు వేలు జీతమిస్తామ‌ని, ఆ యాభై ఇళ్లకు పథకాలు అందించే బాధ్యత అతనిదేనన్నారు. గ్రామ సచివాలయంతో సంప్రదిస్తూ పథకాలను సక్రమంగా అమలు చేసే బాధ్యతను అతనిపైనే ఉంచుతామన్నారు. రేషన్ బియ్యం కూడా నేరుగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నవరత్నాల్లో ప్రతి అంశమూ ఎవరి చుట్టూ తిరిగే పనిలేకుండా, సిఫార్సు లేకుండా, లంచం ఇవ్వకుండా నేరుగా ఇంటికి వచ్చేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో జ‌గ‌న్ ఇచ్చిన తాజా హామీ పై రాష్ట్రంలో పెద్ద చ‌ర్చ‌లే జ‌రుగుతున్నాయి.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like