Saakshyam
Nothing scared but the truth

రైతులకు అపద్బాంధు ప్రకటించిన జగన్

Jagan announced Farmers supporting schemes | Telugu political news | Saakshyam

0

Jagan announced Farmers supporting schemes | Telugu political news | Saakshyam

ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ఆ గుండె చప్పుడిని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు (Jagan announced Farmers supporting schemes ) వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు హయాంలో  రైతన్న దగాపడ్డాడని తెలిపారు. రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం చేశాడన్నారు.  రాష్ట్రంలో చంద్రబాబు దోపిడీ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పంటలు దిగుబడి చూస్తే గుండెతరక్కుపోతుంది. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో సాగు విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. కానీ చంద్రబాబు దేశంలోనే వ్యవసాయంలో మనరాష్ట్రమే నెంబర్‌ వన్‌ అంటాడు. అందుకే చంద్రబాబు నాయుడి ప్రజలు నమ్మం అంటే నమ్మం బాబు అంటున్నారన్నారు.

 

నాబార్డ్‌ నివేదిక ప్రకారం వ్యవసాయం నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున 28 స్థానంలో ఉంది. చంద్రబాబు రైతు రుణమాఫీ మోసం వల్లే రైతులు దారుణంగా నష్టపోయారు. రైతు రుణమాఫీ కనీసం వారి వడ్డీలకు కూడా సరిపోలేదు. వడ్డీ లేకుండా బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేవి. ఆ వడ్డీని ప్రభుత్వాలు కట్టేవి. కానీ చంద్రబాబు దీన్ని పూర్తిగా మరిచిపోయారు. దీంతో రైతులంతా చంద్రబాబును నమ్మం అంటున్నారు ఇచ్చాపురం సభలో వైఎస్ జగన్ అన్నదాతకు భరోసా కల్పించారు. ప్రతి రైతుకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పారు. రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. రైతులకు ఏడాదికి రూ.12,500 పెట్టుబడి నేరుగా ఇస్తామని చెప్పారు. రైతుల సాగు ఖర్చుల తగ్గింపు, పెట్టుబడి సాయంపై పలు హామీలు ఇచ్చారు. రైతులకు బోర్లను ఉచితంగా వేయిస్తామని చెప్పారు. రైతులకు బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. బీమా సొమ్మును రైతు కుటుంబాలకు చేర్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు.

 

Jagan announced Farmers supporting schemes | Teugu news | Saakshyam

పంట వేసేటప్పుడే ధరలు నిర్ణయిస్తామని చెప్పారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సహకార డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు బోనస్‌గా రూ.4 ఇస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల కోసం రూ.4వేల కోట్ల ఫండ్ పెడతామని చెప్పారు. మనం రూ.2 వేల కోట్లు పెడితే కేంద్రం మరో రూ.2వేల కోట్లు పెడుతుందని చెప్పారు. మొత్తం రూ.4వేల కోట్లు అవుతుందన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు. రైతులకు అనుకోని విధంగా ఏమైనా జరిగితే వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం తాము అధికారంలోకి రాగానే చట్టం చేస్తామన్నారు. ఈ రూ.5 లక్షలు కేవలం కుటుంబానికే ఉపయోగపడేలా.. ఈ నిధిపై అప్పుల వారికి హక్కు లేనివిధంగా చేస్తామన్నారు. ప్రతి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like