Saakshyam
Nothing scared but the truth

నీ అజ్ఞానం తో ప్రజల్లో అల్లకల్లోలం సృష్టిస్తావా పవన్ (నిత్య)కల్యాణా?

Immatured thinking of Pawan creates destruction in AP

0

Immatured thinking of Pawan creates destruction in AP | Telugu political news

నువ్వు నీ నిత్య కల్యాణాల తో  ప్రజలకు ఆదర్శ వంతమైన రాజకీయాన్నిస్తావా? లేదా నిత్యానంద స్వామి లాగా నోటికి ఏమి వస్తే (Immatured thinking of Pawan creates destruction in AP) ఆ సూక్తులు బోధిస్తానే ఉంటావా? థామస్ చెప్పాడంటావు, ఎక్కు చెప్పాడంటావు, పీక్కు చెప్పాడంటావు…. ఈ ఎక్కు, పీక్కు లెవరో అర్థం కాక చస్తున్నారు ప్రజలు. నాకు తెలిసి వీళ్లంతా మీ కొత్త పెళ్ళాం బంధువుల పేర్లనుకొంటా . వాళ్ళ పేర్లు వాడుకొని, పెద్ద పెద్ద చరిత్రకారులు కు కలిపేసి నువ్వు చెప్పాలనుకున్నది ప్రజల్లో రుద్ది అయోమయానికి గురిచేస్తున్నావు. తిరుగుబాటు, తిరుగుబాటు అంటా ఆవేశపడిపోతావు. అసలు ఆ తిరుగు బాటు ప్రజల్లో ఎప్పుడొస్తుందో తెలుసా నీకు? “కనీస అవసరాలకు అందని పరిస్థితే తిరుగుబాటు కి కారణం అవుతుంది” ఇది ప్లేటో చెప్పిన మాట. ఒక నాయకుడుగా ప్రజల్లో ఆ పరిస్థితి తీసుకురాకుండా ఎలా ఆదుకొంటావో చెప్పాలి. ఒకసారి జగన్ వైపు చూడు గత 4 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నాడు.

నిజమైన నాయకుడు అపజయాలనుండి పారిపోడు . కానీ నువ్వేమో 2009 లో అపజయాలనుండి పారిపోయి ప్రజలు మరిచిపోయారనుకొని భ్రమపడి, మల్లీ పిల్ల టీడీపీ సేనాని అని పేరుపెట్టుకొని , ఆ పిడికిలిలో చంద్రబాబు ఇచ్చిన దక్షిణ గట్టిగా పట్టుకొని ఎక్కడ జారిపోతుందో అని చెయ్యి పైకెత్తుకుని తిరిగి వచ్చావు. కానీ జగన్ అపజయం నుండి నేర్చుకొని, ప్రజల కస్టాలు తెలుసుకొని విజయం వైపు అడుగేస్తున్నాడు. అదీ నువ్వు చెప్తున్న ఘనులందరూ చేసి విజయాలు సాధించింది. అంతే గాని ఏ ఊరికి పోతే ఆవూర్లో నాలుగు పేర్లు చెప్పేసి, ఊగేసి, ఊగేసి ….. ఊ ….. గే ….. సి ….కింద పడుతావు. అప్పటినుంచీ మళ్ళీ దక్షిణ ఎప్పుడు వస్తుంది. కవాతు ఎప్పుడు పెడదాము అని ఊగడం ఆపేసి, ఊర్ల మీద పడి కొట్టుకొంటావు. ఒక రైతు తన బాధలు చెప్పుకొంటే నవ్వుకొంటావు. అసలు రైతే పండించే పంట జీవన చక్రం తెలుసా నీకు? నువ్వు కూడా పల్లె బాధల గురించి మాట్లాడుతావ్. మా దరిద్రం కాకుంటే నీలాంటి వాళ్ళ స్పీచ్ లు కూడా వినాల్సి వస్తా ఉంది.

ఇల్లుకాలి బూడిదైతే పరిహారం దొరకచ్చు . కలలు కాలి బూడిదైతే ఎవర్ని పరిహారం అడగాలో తెలియక సతమతమౌతున్న ఆంధ్ర రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు,  బడుగు బలహీన వర్గాలకు కొన్నాళ్ళు ఆగండి . అన్నివర్గాలకు సమన్యాయం చేస్తానని ప్రజల్లో తిరిగే నాయకుడు నీకు పారిపోయిన మీ అన్నలా అనిపిస్తున్నాడా? అసలు ప్రజల్లోంచి పారిపోయింది నువ్వు …ఆ తర్వాత మీ అన్న. దేవుడు నీకు కొంత జ్ఞాపక సాక్షి ఇచ్చే ఉంటాడనుకొంటా. గుర్తు తెచ్చుకో.

Immatured thinking of Pawan creates destruction in AP | Telugu news

వైయస్ జగన్ పేరెత్తగానే నీకు భయం కలుగుతుందనుకొంటా . ఆ పేరెత్తిన మరుక్షణమే నాకు ఆయన మీద కోపం లేదని చెప్పేసుకొంటావు. అక్కడ నుంచి మొదలవుతుంది నీ తిక్క. నా తిక్క కు లెక్కుంది నా తిక్కకు లెక్కుంది అంటే ఆ రోజుల్లో అర్థం కాలేదు. ఈ రోజు అర్థమైంది. నువ్వు మాట్లాడే తిక్క మాటలకు నీ పార్టనర్ బాబు లెక్క(డబ్బు) ఇస్తాడని.

నీ ఉపన్యాసాలు నువ్విచ్చుకో. కానీ కులాల పేరిట, వర్గాల పేరిట, ప్రాంతాల పేరిట మనుషుల్లో భేదాలు కలిగించి అల్లకల్లోలం సృష్టిం చే ప్రయత్నం ఇంకా ఇంకా గానీ చేశావో ప్రజలు ఊళ్ళలోకి కూడా రానివ్వకుండా తరిమికొడతారు.

చివరగా ఓ సలహా. రాజకీయ నాయకులు పార్టీ కార్యక్రమాల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి వాడాల్సింది చరిత్ర కు సంబంధించిన సామెతలు కాదు. నీకు తెలియని రాజనీతి శాస్త్రము అని ఉంది. దాన్ని చదివి ఆకట్టుకోవడానికి ప్రయత్నించు.

కథనం మరియు విశ్లేషకులు:

సహదేవ బోడె గారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like