Saakshyam
Nothing scared but the truth

ఇదం జగత్ రివ్యూ అండ్ రేటింగ్…!

Sumanth Idam Jagath Movie Review And Rating || Telugu News || Saakshyam

0

Sumanth Idam Jagath Movie Review And Rating || Telugu Movie News || Saakshyam

నటీనటులు : సుమంత్ , అంజు కురియన్ , శివాజీ రాజా

దర్శకత్వం : అనిల్ శ్రీకంఠం

నిర్మాత : శ్రీధర్ గంగపట్నం

సంగీతం : శ్రీ చరణ్ పాకాల

సినిమాటోగ్రఫర్ : బాల్ రెడ్డి

ఎడిటర్ : గ్యారి బిహెచ్

సుమంత్ , అంజు కురియన్ జంటగా నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కించిన చిత్రం ‘ఇదం జగత్’ ( Sumanth Idam Jagath Movie Review And Rating ). మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

ఏ పని దొరక్క ఖాళీగా రోడ్ల వెంట తిరుగుతున్న నిశిత్ (సుమంత్‌) కు నైట్ రిపోర్టర్ గా జాబ్ వస్తుంది. రాత్రి వేళలో జరిగే ప్ర‌మాదాల్ని, అక్రమాలను షూట్ చేసి ఛానల్ వారికీ ఇస్తుంటాడు. ఆలా జీవనం సాగిస్తున్న నిశిత్ లైఫ్ లోకి మ‌హ‌తి (అంజుకురియ‌న్‌) ఎంట్రీ ఇస్తుంది. ఆమెతో ఫ్రెండ్ షిప్ ఏర్పరచుకొని ఆమెకు దగ్గరవుతాడు. ఓ రోజు అతడి దగ్గరున్న ఓ హత్య కు సంబందించిన వీడియో చూసి నిశిత్ కు దూరం అవుతుంది. మ‌హ‌తి దూరం కావడం తో నిశిత్ జీవితం మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ వీడియో లో ఉన్న హత్య ఎవరిదీ..? దానిని చూసి మ‌హ‌తి ఎందుకు దూరం అవుతుంది..? ఆ హత్య కు , నిశిత్ సంబంధం ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల

 Idam Jagath Movie Review And Rating || Telugu Cinema News || Saakshyam

ప్లస్ పాయింట్స్:

* సుమంత్ యాక్టింగ్

* క్రైమ్ జోనర్

* సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్:

* హీరోయిన్ గ్లామర్

* ఫస్ట్ హాఫ్

* స్లో నరేషన్

* క్లైమాక్స్ సన్నివేశాలు

సాంకేతిక విభాగం :

దర్శకుడు అనిల్ శ్రీకంఠం ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ ను ప్రేక్షకులను అందించాలనుకొని ఆ ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. స్లో నరేషన్ ఊహించిన ట్విస్టులు సినిమాను ప్రభావితం చేశాయి. అయితే అనిల్ తన మొదటి సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు. ఎవరు టచ్ చేయని పాయింట్ తో కథ రాసుకొని మెప్పించాడు. కాగా శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం అంతంత మాత్రం గానే వుంది. గ్యారీ ఎడిటింగ్ పర్వాలేదు. ఇక నిర్మాణ విలువలు సాదా సీదాగా ఉండడంతో సినిమా స్క్రీన్ ఫై ఉన్నతంగా కనిపించలేకపోయింది.

సాక్ష్యం రేటింగ్: 2.5/5

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News and Many More.

Read Another : ‘ఇదం జగత్’ మార్నింగ్ షో టాక్….సినిమా ఎలా ఉందంటే…?

You might also like