Saakshyam
Nothing scared but the truth
Page Right

ఇల్లు అమ్మడానికి కారణం అదే ఎంతో బాధపడ్డాను : జగపతిబాబు

Jagapathi Babu Exclusive interview | Latest news | Saakshyam

0

Jagapathi Babu Exclusive interview | Latest news

ఒక ప్రముఖ నిర్మాత కొడుకుగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు డాన్సు చెయ్యడం రాకపోయినా కూడా అతని నటనతో ప్రేక్షకులను ఎంతో ఆనందపరిచాడు, ఎన్నో హిట్స్ సినిమాలను సోతం చేసుకున్నాడు అయితే ఇండస్ట్రీ లో ఏ హీరోకైనా హీరోయిన్ కైనా హిట్స్ వచ్చినంతవరకే ఎవరైనా పట్టించుకుంటారు హిట్స్ రాని తరుణంలో ఎంత గొప్ప యాక్టర్ అయిన కూడా దర్శక నిర్మాతలు పక్కన పెట్టేస్తారు, ప్రస్తుతం జగపతి బాబు విషయంలో అదే జరిగింది వెనుక ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న కూడా అతని పెర్ఫార్మన్స్ ని బట్టే సినిమా ఆఫర్స్ వస్తాయి, జగపతిబాబు ఎన్నో సినిమాలు చేశారు కాని అతనికి ఆశించిన విధంగా ఇండస్ట్రీ లో కలిసిరాలేదు దాంతో ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. అలాంటి సమయంలో జగపతిబాబు చాల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు దాదాపు మూడు సంవత్సరాలు ఇంటిలోనుండి బయటకి రాలేదు.

Jagapathi Babu Exclusive interview

అసలు బాబుకి ఈ పరిస్థితి రావడానికి గల కారణం అయన మంచితనమే. ఈ విషయాలు అన్ని కూడా జగపతి బాబు తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలోJagapathi Babu Exclusive interview మాట్లాడారు, ఇవే కాదు అతని జీవితంలో జరిగిన అన్ని విషయాలను ఇంటర్వ్యూ లో తెలియజేశారు, ఒకానొక సమయంలో సినిమాలు లేక ఆర్ధికంగా చాల ఇబ్బందులు ఎదుర్కున్నట్లు తెలిపారు, అప్పులు చేసాను, వడ్డీలు పెరిగిపోయాయి అవన్నీ ఇంట్లో తెలియకుండా మైంటైన్ చేసాను, నిజానికి 60 శాతం వడ్డీకి తీసుకొచ్చిన రోజులు కూడా వున్నాయి. ఇక ఇంట్లో ఆ గొడవలు అన్ని తెలియకుండా నేనే వాటిని భరించాను, అప్పుల కారణంగానే ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. ఆ తరువాత నా జీవితంలోకి ఒక వరం లాగా బాలకృష్ణ లెజెండ్ సినిమాలో విలన్ గా ఆఫర్ వచ్చింది ఇక ఆంటేఆ సినిమాతో నా కెరియర్ మొత్తం కూడా టర్న్ అయిపొయింది.

ఆ పాత్ర నాకు తెచ్చిపెట్టిన పేరు అంత ఇంత కాదు అది నేను జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను, లెజెండ్ తరువాత నాకు ఆఫర్స్ ఒక ఉప్పెనలా వచ్చి పడ్డాయి. ఇక అంతే నా కెరియర్ మళ్ళి నాకు తిరిగి వచ్చేసింది కాని ఇల్లు అమ్మేముందు నా కుటుంబ సభ్యులందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇల్లు అమ్మకుండా చూడమని చెప్పారు కాని అది కుదరలేదు అమ్మాల్సి వచ్చింది. నేను ఇల్లు అమ్మినందుకు ఏమి బాధపడలేదు, ఇలాంటి వాటిపై వ్యామోహాలు పెంచుకోకూడదని అర్థమైంది” అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైతే నెం జగపతిబాబు ఫస్ట్ ఇన్నింగ్స్ లో కన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు.

Click here : అననగనగా సాంగ్ ప్రోమో….

You might also like