Saakshyam
Nothing scared but the truth

గాలి వార్తలు నమ్మకండి నేను బాగానే ఉన్నాను : హైపర్ ఆది

0

Hyper aadi, Accident, Social media

జబర్దస్త్ ఫెమ్ హైపర్ ఆది పైన ఎప్పుడు సోషల్ మీడియాలో ఎదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. అదంతా చూస్తుంటే జనాలే అతనికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. చాలామంది ఇటు బుల్లితెర కానివ్వండి అటు వెండితెర కానివ్వండి కాస్తా ఫెమ్ తగ్గిపోయినప్పుడు సోషల్ మీడియాలో ఎదో ఒక రకంగా రచ్చ చేసి పబ్లిసిటీ ఏర్పరచుకొని కాస్తా మైలేజ్ ని పెంచుకోవాలని చూస్తారు కాని హైపర్ ఆది కి అది అవసరం లేదు అతనిపైన ఎప్పుడు ఎదో ఒక వార్త క్రియేట్ చేసి జనాలు ఒక సంచలనాన్ని సృస్టిస్తారు. అప్పుడెప్పుడో హైపర్ ఆది పెళ్లి చేసుకున్నాడు ఇదిగో ఇమే అతని భార్య అంటూ ఆది ఫొటోస్ కొన్ని నేట్టింట్లో షేర్ చేసి దుమారం రేపారు తరువాత కొద్ది రోజులకు ఆది ఆ ఫొటోస్ పైన స్పందించి నాకు పెళ్లి కాలేదు ఒకవేళ పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఉంటె ఆ అమ్మానాన్న చూసిన అమ్మాయినే చేసుకుంటాను అది కూడా అభిమానాలకు చెప్పే చేసుకుంటాను అని వివరణ ఇచ్చాడు.

ఇక అది అక్కడితో ముగిసిపోయింది తరువాత మళ్ళి ఆది జనసేనలోకి వస్తున్నాడు అంటూ అక్కడ సీట్ కూడా కన్ఫిరం అయ్యిందని గాలి వార్తలు పుట్టుకువచ్చాయి అవి కూడా ఫేక్ అని కొన్ని రోజులకు అర్ధమైపోయింది. ఇక్కడి వరకు ఇలా ఉంటె గత నాలుగు రోజుల నుండి ఆది (Hyper aadi) పై మరొక వార్త దుమ్ముదుమారం రేపుతుంది అదేమిటంటే హైపర్ ఆది కి యాక్సిడెంట్ అయ్యిందని అతను ఇక జబర్దస్త్ కి దూరం అవుతున్నారు అంటూ కధనాలు పుట్టించారు. అయితే ఆ గాలి వార్తలపైన తాజాగా ఆది స్పందించి ఒక వివరణ ఇచ్చారు.

దీపావళి సంధర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై మండిపడ్డారు. మీ హిట్స్ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు. అంతే కాదు తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తనకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చాడు..అయితే జబర్ధస్త్ లో ఎందుకు రావడం లేదన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఇది మరి సంగతి ఈ జనాలు ఉన్నారు చూడండి ఇదిగో పలి అంటే అదిగో తోక అంటున్నారు ఇక ఇలాంటివారిని ఏం చెయ్యాలి. నా పైన ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రేటింగ్ సంపాదించుకోవాలని చూసారు అంటూ మండిపడ్డారు.

Click here : తారాజువ్వలు షో గొడవపై ఆగ్రహం వ్యక్తం చేసిన శేఖర్ మాస్టర్…చివరికి…?

 

You might also like