Saakshyam
Nothing scared but the truth

అరవింద సమేత మొదటిరోజు కలెక్షన్స్ చూస్తే…?

0
Ntr, Collection, Aravinda Sametha
త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమా అరవింద సమేత ఈ సినిమా దేశవ్యాప్తంగా అక్టోబర్ 11 వ తారీకు తెలుగు ప్రేక్షకులముందుకు వచ్చి మొదటి షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ ని ఫాన్స్ ఎలాగైతే చూడాలి అని అనుకున్నారు త్రివిక్రమ్ అనతకుమించి చూపించారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అసలు సినిమా అంటే ఇది భయ్యా అంటున్నారు అభిమానులు. నిన్నటినుండి హౌస్ ఫుల్ ఓపెనింగ్స్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ చిత్ర ఫస్ట్ డే కలెక్షన్లు(Collection) కుమ్మేసాయని సమాచారం.ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరిక ఆస్ట్రేలియా రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్ళు రాబడుతుందట. ఈ సినిమాతో ఎన్టీఆర్ అలాగే త్రివిక్రమ్ ఒక మంచి బ్లాక్ బస్టర్  హిట్ ని ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక వసూళ్ళ వివరాల్లోకి వెళ్తే యూఎస్‌లో గురువారం ప్రివ్యూల ద్వారా 791,021 డాలర్లు (సుమారు రూ.5.85 కోట్లు) వసూళ్లు చేసిన ఈ మూవీ ఫస్ట్ డే వన్ మిలియన్ క్రాస్ చేసినట్లు సమాచారం. పొతే ఆస్ట్రేలియా బాక్సాఫీసు వద్ద ‘అరవింద సమేత’ తొలిరోజు 128,740 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.67.63 లక్షలు) వసూలు చేసినట్లు మూవీ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ వసూళ్ళ సునామి చూస్తే ఆస్ట్రేలియా లో అరవింద సమేత 9 వ స్థానంలో నిలుచున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రోజుకు 6 షో లు వేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో  నైజాంలో మొదటి రోజు రూ.8.30 కోట్లు వసూలు చేసింది. దీనిలో షేర్ రూ.5.73 కోట్లు. ఓవరాల్ గా విడుదలైన అన్ని సెంటర్లలో మంచి రికార్డ్స్ సాధించినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ కి ఈ సినిమాతో తిరుగులేదు అని తెలిస్తుంది. చూద్దాం మరి వీక్ ఎండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో…
You might also like