Saakshyam
Nothing scared but the truth

విశాల్ పెళ్లి చేసుకోబోయే తెలుగు అమ్మాయి ఇమే…?

Hero Vishal Getting Marry With Anisha Soon || Telugu News || Saakshyam

0

Hero Vishal Getting Marry With Anisha Soon || Telugu Film News || Saakshyam

నలుపు నారాయణ మెచ్చు అలాగే మన విశాల్ ( Hero Vishal Getting Marry With Anisha Soon) ని ఒక్క కోలీవుడ్ ఇండస్ట్రీ నే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎంతో మెచ్చుకుంటుంది. తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు అతని గురించి చెప్పుకోవాలి అంటే ఒక్క పందెం కోడి సినిమా చాలు. తెలుగు లో పందెం కోడి సినిమా తెచ్చిపెట్టిన ఫెమ్ అతన్ని ఇప్పుడు కూడా అభిమానులు అధరించేలా చేసింది. అయితే ఈ మధ్య కాలంలో విశాల్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఎప్పుడు ఎదో ఒక వివాదం లో వేలు పెడుతూ కోర్ట్ మెట్లు ఎక్కేవరకు తెచ్చుకుంటున్నాడు. అయితే తాజాగా విశాల్ పై మరొక వార్త సోషల్ మీడియా అంత చుట్టేస్తుంది. ఆ వార్త ఏమిటంటే..విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట, అది కూడా ఒక తెలుగు అమ్మాయిని అని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా అతని తండ్రి జీకే రెడ్డి వెల్లడించారు.

అయితే ఈ సంవత్సరం కాదట వచ్చే సంవత్సరం విశాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు అయన స్పష్టం చేశారు. హీరోగా, నడిగరం సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ లు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ ఓట్టి గాలి వార్తలను ఈరోజు స్పష్టం అయిపొయింది. అయితే ఈ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం కాదని ఇది ప్రేమ వివాహం అని విశాల్ చెప్పుకొచ్చారు అంతేకాకుండా త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరువైపుల పెద్దలూ త్వరలోనే కలుసుకుని ఎంగేజ్‌మెంట్‌కు డేట్ ఫిక్స్ చేస్తారని సమాచారం. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఆ తెలుగమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుదని? అంటే ఆ అమ్మాయి పేరు అనీషా.

హైదరాబాద్‌కి చెందిన విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల ముద్దుల కుమార్తె. విజయ్ రెడ్డి బిజినెస్ చేస్తున్నారు. అయితే గతంలో విశాల్ నడిగరం సంఘం నిర్మాణం పూర్తీ అయిన తరువాతే పెళ్లి చేసుకునత్ను అని ప్రకటించాడు ఇక అది పూర్తీ అవ్వగానే ఈ అమ్మాయితో పెళ్లి ఉంటుందట ఇంతలో ఎంగేజ్మెంట్ జరుగుతుందని సమాచారం. ఇక ఆరోజే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారట. ఇది మరి మ్యాటర్…మొత్తానికి విశాల్ ఒక తెలుగింటి అల్లుడు కాబోతున్నాడు.

You might also like