Saakshyam
Nothing scared but the truth
Page Right

అలకబూనిన హరీష్ రావు.. బుజ్జగించిన కేటీఆర్, ఇందుకోసమేనా 

0

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారానికి రాజీనామా చేసి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఆయనతో పాటు పార్టీనేతలు సైతం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో  పార్టీలో కేటీఆర్- హరీష్ రావుల(Harish Rao) విషయంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.. గత కొంతకాలం క్రితం తన నియోజక వర్గంలోని పనుల కోసం హరీష్ రావు కేసీఆర్ ని కలిశారు. అయితే ఆ విషయంపై కేటీఆర్ ని సంప్రదించాలని సూచించడంతో అసంతృప్తి చెందిన ఆయన వెనుదిరిగారు. ఆ తరువాత హరీష్- కేటీఆర్ ల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. టిఆర్ఎస్ అధికారిక మీడియా సమావేశాలకు హరీష్ రావుని దూరం పెట్టారు. దీంతో మిన్నకుండిపోయిన హరీష్ ఏమి మాట్లాడలేదు.

ఇటీవల గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరినా మారు మాట్లాడలేదు. దీంతో హరీష్ తో విబేధాలు పార్టీ పతనానికి దారి తీస్తాయని భావించిన కేసీఆర్, కేటీఆర్ లు ఆయన్ని బుజ్జగించే పనిలో పడ్డారు.అందుకే టిఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో హరీష్ రావు ఉండేలా చూసుకుంటున్నారు. హరీష్ రావు కలగజేసుకున్నాక కాంగ్రెస్ లో చేరిన నేతలు అనూహ్యంగా తిరిగి టిఆర్ఎస్ లోకి వచ్చేశారు. ఇక అప్పుడు హరీష్ బలం తెలుసుకున్న కేటీఆర్ ఆయన్ని ప్రతి కార్యక్రమానికి పిలుస్తూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పార్టీలో హరీష్ రావుని కేవలం రాజకీయాల అవసరాల కోసమే వాడుకుంటున్నట్లు అనిపిస్తోంది. ముందు ముందు హరీష్ రావుకి సరియైన స్థానం లభిస్తుందా లేక ఎన్నికలు  ముగిశాక మళ్ళీ పక్కన పెడుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

 

You might also like