Saakshyam
Nothing scared but the truth

బట్టేబాజ్‌ లగడపాటి అబద్దపు సర్వేలు కట్టిపెట్టు : హరీష్ రావు

0

ఎటువైపు నుండి చూసుకున్న లగడపాటి సర్వే కి వ్యతిరేకతే ఎదురోతుంది తాజాగా లగడపాటి చేసిన సర్వే లో తెలంగాణాలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమేనాని తేల్చి చెప్పాడు అయితే ఆ సర్వే వెనుక చంద్రబాబు హస్తం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటె లగడపాటి పై ఒకవైపు కేటీఅర్ మరోకవైపు హరీష్ రావు విచ్చల విడిగా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు లగడపాటి రాజగోపాల్ సర్వే పై మండిపడ్డారు. తెలంగాణా అభివృద్ధి ని ఎదుర్కోవాలని కొంతమంది దొంగలు చూస్తున్నారు అని అందులో ఒకరు బట్టేబాజ్‌ లగడపాటి రాజ్‌గోపాల్‌ ఒకరని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

బుధవారం సిద్దిపేటలో జరిగిన రోడ్ షో అతను లగడపాటి పై విరుచుకు పడ్డారు అ రోడ్ షో లో హరీష్ రావు కి జనాలు బ్రహ్మరథం పట్టారు. దీంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది. జనల మధ్యలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగింది అప్పటినుండి తెలంగాణాలో కేసీఆర్ అభివృద్ధి ఒక రేంజ్ లో జరిగింది ఆ అభివృద్ధి ని తట్టుకోలేక చంద్రబాబు రిగి మళ్ళి తెలంగాణాని ఆంధ్రాలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఏజెంటుగా మారిన లగడపాటి అబద్దపు సర్వేలు చేస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ గెలవదనడం జోక్‌లా ఉందన్నారు. ఉత్తిత్తి మాటలు చెప్పి జనాలను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్న ఉత్తమ కుమార్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని అయన పేర్కొన్నారు.

జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణలు తమ నియోజకవర్గాలకే పరిమితమై బయట ప్రచారానికి రావడంలేదని వీళ్లంతా కాంగ్రె్‌సలోని సీఎం అభ్యర్థులని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో గెలుపోటమి గురించి అసలు ఆలోచించడం లేదని అక్కడ గెలుపు తమనే వరిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు అంతేకాకుండా తమ నియోజికవర్గ ప్రజలకు సహాయపడకపోతే తమకు నిద్ర ఉండదని వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో లక్ష మెజారిటీని అందిస్తామని ప్రజలు ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఈ ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రాలకు మళ్ళి కష్టాలు తప్పవని అతని వెల్లడించారు.

You might also like