Saakshyam
Nothing scared but the truth

నేను అతనితో అలా ఉంటె తప్పేంటీ : గీతామాధురి

0
Geetha Maduri, samrat ,  audions
గీత మాధురి ఇమే పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే ఇమే గత కొన్ని సంవత్సరాల నుండి టాలీవుడ్  ఇండస్ట్రీ లో పాటలు పాడుతూ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ మధ్య కాలంలో మొదలైన బిగ్ బాస్ షో లో ఒక కంటేస్టెంట్ గా హౌస్ లో హడావిడి చేసింది. చివరి వరకు కూడా చాలా ప్లానింగ్ తో గీత గేమ్ ఆడింది అందరు కూడా ఆమె తెలివితేటలూ చూసి విన్నర్ గా నిలుస్తుంది అని భావించారు కాని సెకండ్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇది ఇలా ఉంటె బిగ్ బాస్ హౌస్ లో సామ్రాట్ అలాగే గీత కి మధ్య అఫైర్ ఉందంటూ కొన్ని కధనాలు బయటకి వచ్చాయి దానికి సంబంధించన ఫొటోస్ కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అయితే తాజాగా వాటిపైన గీత మాధురి స్పందించారు,
మేమిద్దరం చాలి చాలని ఫుడ్ షేర్ చేసుకున్నాం, ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం అలాంటప్పుడు మేమిద్దరం అలా ఉంటె తప్పేంటి అంటూ గీత(Geetha Maduri) ప్రశ్నించింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే తాజాగా గీత హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత ఒక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించారు, ‘‘ఒక మనిషిని కళ్లల్లో కళ్లు పెట్టి చూడకుండా.. జుట్టుని, చెవులను, ముక్కుని చూసి మాట్లాడాలా? గేమ్ ఆడుతున్నప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటాం. నేను అమిత్ భయ్యాతో కూడా అలాగే చేశా. కాని సామి విషయంలో మాత్రం ఇలా జరిగింది దానికి నన్ను ఏం చెయ్యమంటారు జనాలు ఎవరికీ నచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారు దానికి నేను ఏం చెయ్యాలి అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా నెక్ట్స్ బిగ్‌బాస్‌కి వచ్చే వాళ్లను ఎవరినీ ముట్టుకోవద్దు, ఎవరినీ చూడొద్దు.. ఎవరితో మాట్లాడొద్దు సైడ్‌కి వెళ్లిపోయి సైలెంట్‌గా వెళ్లి కూర్చో అని చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజానికి నేను రోల్ రైడా తో గేమ్ ఆడాను, అమిత్ భయ్యా తో గేమ్ ఆడాను మరి వాళ్లతో ఇలాంటివి రాలేదే ఒక్క సామ్రాట్ తో మాత్రం ఎందుకు ఇలా అంటున్నారు నాకు నందు తప్ప మరెలాంటి రిలేషన్ అయిన అవసరం లేదు నా జీవితంలో  నందు లాంటి రిలేషన్ కానిదేదైనా ఒకటే. చాలా రోజులు మనం కలిసున్నాం. మనం చూపులతోనే మాట్లాడుకోవచ్చు అని కూడా నేను చెప్పా. కాని జనాల్లోకి సామీ విషయం ఇలా వెళ్ళిపోయింది. దానికి నేను ఏమి చెయ్యలేను, ఎవరు ఎన్ని అనుకున్న నాకు అవసరం లేదు నాకు నందు ఒక్కడు ఉంటె చాలు అంటూ చెప్పేసింది గీతామాధురి.
You might also like