Saakshyam
Nothing scared but the truth
Page Right

కేసీఆర్ పై పోటీకి సై అంటున్న గద్దర్

0

Gaddar Ready, KCR, telangana, Elections

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హవా కొనసాగుతోంది. వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గద్దె (Gaddar Ready) దించాలనే వ్యూహంతో మహాకూటమి సంసిద్దమవుతోంది. కేసీఆర్ కి పట్టు ఉన్న మెదక్ జిల్లాలో ఆయన్ని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో పలువురు నేతలు రన్గగంలోకి దిగుతున్నారు. ప్రజా గాయకుడూ గద్దర్ సైతం ఈసారి ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని రజత్ కుమార్ ని కలిసిన గద్దర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటే తానూ కేసీఆర్ పై పోటీకి సిద్ధమేనన్నారు. గజ్వెల్ లో నే తనకు ఓటు హక్కు నమోదు చేయించుకున్నానని, ఓటు హక్కు వినియోగంపై ఊరారా ప్రచారం చేస్తానన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ కి ఈసారి ప్రజలు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.

You might also like