Saakshyam
Nothing scared but the truth
Page Right

ప్రాణాలతో బయట పడిన రాహుల్…?

0

ఎన్నికల సమయం దగ్గర పడడంతో రాజకీయ నేతలు ఎవరి పార్టీ ని వారు ప్రచారం చేసుకోవడం కోసం సభలు, ర్యాలిలు నిర్వహిస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రచారంలోకి దిగేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో శనివారం రోజు నిర్వహించిన రోడ్డు షో లో పాల్గొన్నారు. అయితే అక్కడ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కి ఒక అపశృతి ఎదురయ్యింది. నిర్వహించిన రోడ్డు షో లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు రాహుల్ గాంధీ ఆ అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్నారు. రాహుల్‌తోపాటు మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఓపెన్‌ టాప్‌ జీపులో వెళ్తుండగా..

ఆ పక్కనే కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండాలు, మూడు రంగుల గ్యాస్‌ బెలూన్లను పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో రాహుల్‌కు హారతి ఇవ్వడానికి వివిధ లేయర్లుగా ఉండే భారీ దీపాన్ని తీసుకొచ్చాడు. ఆ దీపం బెలూన్లకు తగలడంతో ఉవ్వెత్తున మంట ఎగసిపడింది. ఆ మంటలు కొద్ది సమయం వరకు అలాగే కొనసాగాయి అది చూసిన జనాలు అక్కడి నుండి పరుగులు పెట్టారు. కాని రాహుల్ గాంధీ మాత్రం ఆ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు అని చెప్పుకోవచ్చు.

You might also like