Saakshyam
Nothing scared but the truth

ఏంటీ రామోజీ టీఅర్పి కోసం మరి ఇంత దిగజారిపోవాలా…?

0

ఎన్నికల సమయం ఆసన్నమౌతుండడంతో న్యూస్ చానెల్స్ మొత్తం కూడా ఎన్నికల పైనే దృష్టి పెట్టాయి ఒక్కో న్యూస్ చానెల్ ఒక్కో రాజకీయ నేతని హైలేట్ చేస్తూ మంచి టీఆర్ పి రేటింగ్ సంపాదించుకుంటున్నారు. కేవలం ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ బూత్ లు, ఓటర్లు, ఎన్నికల ఏర్పాట్లు.. ఇవే ప్రధానాంశాలు. ఇదే తరహాలో ఈ టీవీ కూడా చంద్రబాబు పధకాలను హైలేట్ చేస్తూ మంచి రేటింగ్ ని కొల్లగోడుతున్నట్లు తెలుస్తుంది. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా ఏపీలో పంపిణీ చేస్తున్న చంద్రన్న కానుకలకు సంబంధించి మంత్రి పెట్టిన ఓ ప్రెస్ మీట్ ని హైలెట్ చేసి చూపించింది ఈటీవీ. పదే పదే చంద్రన్న ఇస్తున్న కానుకలను సంచులను తెరపైన చూపిస్తూ క్యాష్ చేసుకుంటున్నాడు రామోజీ, అసలు నిజానికి ఈ న్యూస్ బులిటెన్ లో చూపించే న్యూసే కాదు కాని వారు మాత్రం చంద్రన్న న్యూస్ ని బులిటెన్ లో చూపించి రచ్చ షురు చేస్తున్నారు.

అయితే ఎన్నికల కోడ్ ని తప్పించి చంద్రబాబు ని హై లేట్ చెయ్యాలి అంటే ఆ మాత్రం దిగజారుడు తప్పడులెండి, 2019 ఎన్నికల కోసం చంద్రబాబు ఎంత కష్ట పడుతున్నాడో అందరికి తెలిసిన విషయమే బాబు ఎందుకు అంతగా కష్టపడుతున్నారు అంటే దానివెనుక కూడా ఒక రహస్యం ఉంది అతనిపైన ఒకవైపు ఏపీలో మరోవైపు తెలంగాణాలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ముద్ర వేసుకుంది ఆ ముద్రని తరిమికొట్టడానికి బాబు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు అయిన కుడా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు ఎక్కడికి వెళ్ళిన ఏది చేసిన అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి దాంతో బాబుని ఎలాగైనా సరే హైలేట్ చెయ్యాలని అతని పధకాలను విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. పదే పదే బాబు గురించి పొగుడుతూ హెడ్ లైన్స్ వేసేస్తున్నారు,

ఇలా ఒక్క ప్రకటనలే కాదు, అనుకూల మీడియా వండివార్చే కథనాల్లో కూడా ఏపీలో ఏదో పెద్ద అభివృద్ధి జరిగిపోతోందని, తెలంగాణలో కూడా టీడీపీ నిర్ణయాత్మక శక్తిగా మారితే అలాంటి అభివృద్ధే జరుగుతుందని చూపించారు. అయితే ప్రచార సమయాల వరకు బాగానే ఉంది మరి కోడ్ అమల్లోకి వచ్చిన కొన్ని గంటలు కూడా ఈటీవీ మౌనంగా ఉండలేకపోయింది, స్వామి భక్తిని చూపించుకునేందుకు తాపత్రయ పడింది. అయితే ముందస్తు ఎన్నికలు ఒక్క తెలంగాణాలోనే జరుగుతున్నాయి ఏపీలో లో జరగడం లేదు కాబట్టి ఇక్కడ వార్తలకు పరిమితులు ఉండవనే లాజిక్ తో మంత్రిగారి ప్రెస్ మీట్ ని టెలికాస్ట్ చేసింది. పనిలో పనిగా బాబు గారి గురించి అతని పధకాల గురించి హై లేట్ చేసే పనిలో పడింది ఈటీవీ.

You might also like