Saakshyam
Nothing scared but the truth

బాలకృష్ణ ప్రచారానికి ఎన్నికల సంఘం నిరాకరణ

EC denies Balakrishna for campaigning || Election News || Saakshyam

0

EC Denies Balakrishna For Campaigning || Telugu Political News || Saakshyam

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన బుధవారం బాలకృష్ణ హైదరాబాద్లో ప్రచారం చేయడానికి వీల్లేదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది (EC Denies Balakrishna For Campaigning). దీంతో టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ నాలుగు రోజులుగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది చంద్రబాబేనని, ఆయన్ను తెలంగాణకు దూరం చేసే దమ్ము ఎవరికీ లేదంటూ ప్రచారం సాగిస్తూ వస్తున్నారు.

EC Denies Balakrishna For Campaigning || Telangana News || Saakshyam

ఓ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగ్ నేర్పించారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లే సైబరాబాద్ అభివృద్ధి చెందిందని సూచించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ కు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదును పరిశీలించిన రజత్ కుమార్. బుధవారం ప్రచారం చేయకూడదంటూ బాలకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదని ఆయనకు స్పష్టం చేశారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Read Another : చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ

You might also like