Saakshyam
Nothing scared but the truth
Page Right

దేశంలో దొంగలు పడ్డారు రివ్యూ అండ్ రేటింగ్….!!

0

నటీనటులు : ఖయ్యుమ్ అలీ, లోహిత్ కుమార్, పృథ్వి రాజ్, సమీర్, షాని సోలొమాన్, తనిష్క్ రాజన్.
దర్శకత్వం : గౌతమ్ రాజ్ కుమార్
నిర్మాతలు : రామ గౌతమ్
సంగీతం : శాండీ
సినిమాటోగ్రఫర్ : శేఖర్ గంగనమోని

నూతన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’(Desamlo Dongalu Paddaru). సారా క్రియేషన్స్ ప‌తాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కధ :

శక్తి(ఖయ్యుమ్), బిజ్జు(షాని)తోడు దొంగలు. శక్తి మంచోడే అయినా స్నేహితుడి కోసం వీటికి పాల్పడుతూ ఉంటాడు. ఓ పెద్ద సెటిల్మెంట్ కోసం సీత(తనిష్క్ రాజన్)ను కిడ్నాప్ చేస్తాడు బిజ్జు. తనను విడిపించడం కోసం విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటాడు పృథ్విరాజ్. కొన్ని సంఘటనల తర్వాత శక్తి, బిజ్జు అపార్థాలతో విడిపోతారు. బిజ్జు, పృథ్విరాజ్ లు కలిసి శక్తి, సీతల వెంట పడతారు. అప్పుడే శక్తికి సీత వెనుక ఉన్న ఒక ట్రాజెడీ గురించి తెలుస్తుంది. దాంతో తన లక్ష్యాన్ని మార్చుకుంటాడు. చివరికి ఏమైంది అనేదే బాలన్స్ కథ నటన పరంగా ఆర్టిస్టులు తమ వంతు ప్రయత్నం చేసారు. ఖయ్యుమ్ లో టాలెంట్ ఉన్నప్పటికీ ఇంత ఏజ్ బార్ టైం లో హీరోగా ఎందుకు చేయాలనిపించిందో అర్థం కాదు. షాని బాగా చేసాడు. హీరోయిన్ తనిష్క్ రాజన్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఓ మెసేజ్ మిక్స్ చేయాలనుకున్న క్రైమ్ థ్రిల్లర్ గా సినిమాలో అందరిని వాడుకున్నారు కానీ కథనం మాత్రం గాలికి వదిలేసారు.

ప్లస్ పాయింట్స్ :

* ఖ‌యూమ్‌ నటన
* పృథ్వి రాజ్, సమీర్, లోహిత్ పెర్ఫార్మన్స్
* హీరోయిన్ గ్లామర్

మైనస్ పాయింట్స్ :

* సెకండ్ హాఫ్
* ఓవర్ యాక్టింగ్
* ప్లో లేని స్క్రీన్ ప్లే

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు గౌతమ్ రాజ్ కుమార్ స్టోరీ ఐడియా మంచిదే తీసుకున్నప్పటికీ, ఆ ఐడియాని ఎలివేట్ చేసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు. పైగా ఉన్న స్క్రిప్ట్ ని కూడా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.సంగీత దర్శకుడు శాండీ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇక ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా చిత్రానికి అనుగుణంగానే సాగుతుంది. కెమెరా బాధ్యతలను నిర్వహించిన శేఖర్ గంగ‌న‌మోని తమ కెమెరాతో మ్యాజిక్ చేయకపోయినా పర్వాలేదనిపించాడు.ఎడిటర్ మ‌ధు.జి.రెడ్డి ఎడిటింగ్ పనితనం అస్సలు ఆకట్టుకోదు. నిర్మాతలు తమ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం పెంచి ఉండాల్సింది.

సాక్ష్యం రేటింగ్ : 2/5

You might also like