Saakshyam
Nothing scared but the truth

చంద్రబాబు నుంచి ప్రజాస్వామ్యాన్నిరక్షించాలి

Defend democracy from Chandrababu

0

Defend democracy from Chandrababu | Telugu Political News

ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం ఏకైక లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ( Defend democracy from Chandrababu) గతంలో మేము చేసుకున్న పరస్పర ఆరోపణలు అన్నీ మర్చిపోయి దేశాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసి పని చేయాలనుకొంటున్నాం అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసం వద్ద చంద్రబాబు తమ నూతన బంధంపై మీడియాకు వివరణ ఇచ్చుకొన్నారు.

ఈ పొత్తుకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమిటి? అని  మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలను విననట్టు నటిస్తూ ఇరువురు నేతలు చిరునవ్వులు చిందిస్తూ వెనుదిరిగి వెళ్లిపోయారు. రాహుల్, చంద్రబాబు కలిసి పని చేసుకొనే క్రమంలో పరస్పరం గతాన్ని మర్చిపోవచ్చుగాక, కానీ, ప్రజలు ఆ రెండు పార్టీల మధ్యనున్న వైరుధ్యాన్ని మర్చిపోగలరా? తనను, సోనియా గాంధీని చంద్రబాబు అవమానకరరీతిలో దూషించినప్పటికీ, రాహుల్‌గాంధీ ఆ మాటలను మరచిపోవడానికి కారణం చంద్రబాబు ఆయనకు తమను ఆర్థికంగా ఆదుకొనే ఆపద్బాంధవుడిగా తను ఉండడమే.

Defend democracy from Chandrababu | Telugu News

ఎన్డీఏ నుంచి బయటకొచ్చే ముందే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి చేరువ కావడానికి మార్గం సుగమం చేసుకొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపినట్టు చంద్రబాబు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు దృష్టిలో ఏమిటి? ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య మనుగడ సవ్యంగానే ఉన్నదా? రాజ్యాంగ వ్యవస్థలు అపహాస్యం కావడం లేదా? ప్రధాన ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకొని అందులో నలుగుర్ని మంత్రులుగా చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారితో రాజ్యాంగం మీద ప్రమాణం చేయించి మంత్రులుగా చేర్చుకోవడాన్ని మించిన రాజ్యాంగ ఉల్లంఘన మరొకటి ఉంటుందా? సంకీర్ణ రాజకీయాల్లో చంద్రబాబు మాదిరిగా ఊసరవెల్లి రంగులు ప్రదర్శించిన నేత దేశంలో మరొకరు కనపడరు.

చంద్రబాబు సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా మద్యాన్ని, కరెన్సీని విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికలను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు. ఫలితంగానే లోక్‌సభలో, రాజ్యసభలో అత్యంత ధనవంతులైన వారు టీడీపీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తను నాలుగున్నరేళ్ల అధికారంలో పాల్పడిన అవినీతి, అక్రమాలు వివిధ రూపాల్లో బయట పడుతుంటే సీఎం చంద్రబాబు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వణికి పోతున్నారు. అందుకే సీబీఐ, ఈడీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయంటూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతే దానికి రాజకీయం పులమడానికి, అండగా దేశంలోని ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు నిలబడటానికి మాత్రమే చంద్రబాబు యూపీఏ పక్షాల చుట్టూ తిరుగుతున్నారు. పేరుకు ప్రధాని మోదీకి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు చేయడంగా చూపిస్తూ, చట్టం నుంచి తను తప్పించుకోవడం కోసం   చంద్రబాబు వేస్తున్న సరికొత్త వ్యూహం.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More

clickhere: 11న కాదు, 10 నాడే చంద్రబాబు కూటమి ఫలితం

You might also like