Saakshyam
Nothing scared but the truth

11న కాదు, 10 నాడే చంద్రబాబు కూటమి ఫలితం

december-10-will-be-testing-day-for-chandrababu

0

December-10-will-be-testing-day-for-Chandrababu | Telugu Political News

డిసెంబర్ పదకొండో తేదీ దేశ రాజకీయ పరిణామాలకు కూడా కీలకం కాబోతోంది. వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్దేశించబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న ( December-10-will-be-testing-day-for-Chandrababu )వెల్లడి కాబోతున్నాయి . ఒకవేళ ఈ రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తనసత్తా చూపిస్తే, మళ్లీ మోడీకే మంచి అవకాశాలుంటాయి. రాజస్తాన్ పోయినా కనీసం మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో కమలం పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన విజయం సాధిస్తే కమలానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం లేనట్టే. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోతే అంతే సంగతులు. రాజస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా అదేమీ అద్భుతం కాదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లలో కూడా కాంగ్రెస్ సత్తాచూపిస్తే అప్పుడు కాంగ్రెస్ కాస్తో కూస్తో కోలుకున్నట్టుగా అవుతుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ సత్తా ఏమిటో తేలిపోతుందిప్పుడు.

December-10-will-be-testing-day-for-Chandrababu | Telugu News

జాతీయ స్థాయిలో డిసెంబర్ పదో తేదీనే మహాకూటమి పెద్ద పరీక్షను ఎదుర్కొనబోతోంది. ఆ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమిలోని పార్టీల నేతలందరితోనూ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ఆ సమావేశానికి ఎవరెవరు వస్తారనేది ఆసక్తిదాయకం. కూటమి నేతలందరినీ తనే ఒక వేదిక మీదకు తీసుకొస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకుని తిరుగుతున్నాడు. మరి తొలిసారి చంద్రబాబు మీటింగ్ కు ఎవరెవరు వస్తారు అనేది ఆసక్తిదాయకం. పాత వాళ్లు ఉంటారా, కొత్తవాళ్లు వస్తారా అంటే మాయవతి ఈ మీటింగ్ కు రానని అంటోందని సమాచారం. మాయ మాత్రం ఈ ఆహ్వానాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని సమాచారం. తను ఈ మహాకూటమి మీటింగ్ కు హాజరయ్యే ప్రసక్తి లేదని మాయ స్పష్టం చేసినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More

Clickhere: లగడపాటి గుట్టు విప్పిన కేటీయార్

 

You might also like