Saakshyam
Nothing scared but the truth

స్విమ్స్ లో భారీ కుంభకోణం: నవీన్ కుమార్ రెడ్డి

Corruption and irregularities are happening in SVIMS

0

Corruption and irregularities are happening in SVIMS | telugu political news

స్విమ్స్ లో భారీ కుంభకోణం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, రాయలసీమ పోరాట (Corruption and irregularities happening in SVIMS ) సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. స్విమ్స్ లోని వీరబ్రహ్మేంద్ర మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ మందుల షాపుకు గత పది నెలల బాడుగ (3,41,00,000) మూడు కోట్ల నలభై లక్షలు చెల్లించని షాప్ కాంట్రాక్టర్ పై స్విమ్స్ డైరెక్టర్, టిటిడి ఇఓ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. స్విమ్స్ కు రావాల్సిన సొమ్మును కాంట్రాక్టర్ వద్ద నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత స్విమ్స్ డైరెక్టర్ కు లేదా అని ఆయన నిలదీసారు.

Corruption and irregularities happening in SVIMS

సిమ్స్ హాస్పిటల్ లో ముఖ్యమంత్రి బంధువులమని చెప్పుకుంటూ మెడికల్ మాఫియాను ప్రోత్సహిస్తున్న వారి కారణంగా సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటుందని నవీన్ కుమార్ వెల్లడించారు. సిమ్స్ కి చెల్లించవలసిన మూడు కోట్ల 40 లక్షల పై సాక్ష్యాధారాలతో సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా కలెక్టర్ టిటిడి ఈవో, టీటీడీ CV&SO, సీన్స్ డైరెక్టర్, మెడికల్ సూపరిండంట్, అకౌంట్ ఆఫీసర్లకు రిజిస్టర్ పోస్టు ద్వారా లేఖ పంపానని ఆయన తెలిపారు. స్విమ్స్ కు రావలసిన సొమ్ము కాంట్రాక్టర్ వద్ద నుంచి అధికారులు రికవరీ చేయని పక్షంలో హై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like