Saakshyam
Nothing scared but the truth

సిపిఎస్ విధానం ఉద్యోగస్తుల పాలిట శాపం

Contributory Pension Scheme is curse to Employees | Telugu news | Saakshyam

0

Contributory Pension Scheme is curse to Employees | Telugu news | Saakshyam

ఉద్యోగుల పాలిట మరణ శాసనంలా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సిపిఎస్) పై టీటీడీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసారు. టీటీడీ పరిపాలనా భవనం (Contributory Pension Scheme is curse to Employees) వద్ద ఓల్డ్ పెన్షన్ స్కీం(OPS) కొరకు 36 గంటల నిరాహార దీక్షను టీటీడీ ఉద్యోగులు చేపట్టారు. ఉద్యోగులు చేస్తున్న  నిరాహార దీక్షకు కాంగ్రెస్ నాయకులు, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్టియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉద్యోగులకు సంఘీభావంగా దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తరువాత పెన్షన్ అనేది భవిష్యత్తుకు భరోసా ప్రాథమిక హక్కు అని, అలాంటి హక్కుని హరించడం దుర్మార్గమన్నారు.

 

Contributory Pension Scheme is curse to Employees | Telugu news | Saakshyam

సిపిఎస్ కారణంగా టీటీడీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న సుమారు 2,500 మంది నష్టపోతున్నారని నవీన్ తెలిపారు. సిపిఎస్ విధానం దేశవ్యాప్తంగా పెనుభూతంగా మారి ఉద్యోగస్తుల పాలిట శాపంగా మారిందని, టీటీడీ ఇఓ చొరవతో ధర్మకర్తల మండలి సమావేశంలో సిపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని డిమాండ్ చేసారు. భారతదేశంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఖరీదైన ఇంటిస్థలంతో పాటు, జీవితకాలం పెన్షన్లతో ఉచితంగా వైద్యం, రవాణా సౌకర్యాలు పొందుతున్నారని తెలిపారు. అలాంటి వాటిని కుదించి ప్రభుత్వాలు కొత్త మార్పులు తీసుకురావాలే తప్ప 40 సంవత్సరాలు నిరంతరం ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ దక్కకుండా చేయడం అన్యాయమని నవీన్ ఆరోపించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సిపిఎస్) వద్దు ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపిఎస్) ముద్దు అంటూ ఉద్యోగులు నినాదాలు చేసారు.

Contributory Pension Scheme is curse to Employees

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like