Saakshyam
Nothing scared but the truth
Page Right

బీజీపీ ని చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్…కొల్కోవడం కష్టమే…!!

0

Congress, BJP party, Karnataka

ఈరోజు ఉదయం నుండి కర్ణాటకలో పలు నియోజిక వర్గాలలో ఉపఎన్నికలు జరిగాయి, ఇప్పటివరకు కర్ణాటకలో విజయంతో దూసుకుపోయిన బీజేపీ కి ఈ ఉపఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది కాంగ్రెస్ (Congress) బీజేపీకి కొల్కోలేని షాక్ ని ఇచ్చింది. మూడు లోక్ సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో…బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ముందడుగు వేసింది మిగిలిన నాలుగు స్థానాలలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీ తో పరుగులు పెట్టింది. జామ్ ఖండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఏఎస్ న్యామగౌడ తన ప్రత్యర్థిపై 39,480 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అలాగే బీజేపీ కి వెన్నుముఖ లాంటి బళ్లారిలో కూడా ఊహించని షాక్ తగిలింది, బళ్లారిలో కూడా కాంగ్రెస్ ఉగ్రప్ప 2,14,826 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. ఇటివల కాలంలో బళ్లారిలో ఎంపీగా ఉండిన శ్రీరాములు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా పోవడంతో.. ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

ఈ నేపథ్యంలో ఆయన చెల్లెలు శాంత బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసింది. ఈ సీటులో బీజేపీ ఓడిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇక అక్కడ ఈరోజు కాంగ్రెస్ సంచలనం సృష్టించింది, మొత్తానికి బళ్లారిలో ఎంపీ సీటును సొంతం చేసుకుంది.మండ్య లోక్ సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి శివరామేగౌడ 2,33,517 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రామానగర అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అనిత 1,05,294 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. శివమొగ్గ లోక్ సభ స్థానంలో మాత్రం బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర 47,388 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. మరోసారి తమకు భారీ విజయం కట్టబెట్టినందుకు కర్ణాటక ప్రజలకు మాజీ ప్రధాని, జేడీఎస్ చీప్ హెచ్‌డీ కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.ఎట్టకేలకు కాంగ్రెస్ ఊపందుకుంది.

Click here : రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ తో రెండో పెళ్ళికి సిద్దమైన చంద్రబాబు

You might also like