Saakshyam
Nothing scared but the truth

క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు…?

0

Congress lead in Karnataka elections | Political news

కాంగ్రెస్ పార్టీ కి జేడీఎస్ మహాకుటమి బీజేపీ పార్టీ కి పోరు ఒకరకంగా లేదు. ప్రస్తుతం కర్ణాటకలో ఉపఎన్నికలు జోరందుకున్నాయి, ఆ రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు పోటిగా నిలబడ్డారు ఊహించని విధంగా ఫలితాలు వేల్లడౌతున్నాయి, క్షణ క్షణం నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. కాంగ్రెస్ కి ఏపీ లో పట్టులేకపోయిన కూడా కర్ణాటక లో కాంగ్రెస్ చక్రం తిప్పుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉపఎన్నికలు (Karnataka elections) జరుగుతున్నాయి ఆ ఉపఎన్నికల జోరు ఎలా ఉందంటే ఫలితాలు ఒక్కొక్కరిలో క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్  లీడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలు సహా ఐదు చోట్ల ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Karnataka elections | latest political news

ఇప్పటివరకు కర్ణాటకలో తమ జెండా ఎగరువేసిన బీజేపీ ప్రస్తుతం ఉపఎన్నికల్లో ఒక్క స్థానంలోనే జోరుమీద ఉంది మిగిలిన నాలుగు స్థానాలలో కాంగ్రెస్ జేడీఎస్ మహాకుటమి ఊపండుకుంటుంది. బీజేపీ 11 వేల ఆధిక్యంలో ఉండగా, బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు జమఖండిలోనూ కాంగ్రెస్ 11 వేల భారీ ఆధిక్యంలో సాగుతోంది. కాంగ్రెస్ మిత్రపక్షం జేడీఎస్ రామానగరలో 36 వేల ఓట్ల ఆధిక్యంతోనూ మాండ్యలో లక్షకు పైగా ఓట్ల ఆధిత్యంతో పరుగెడుతోంది. మొత్తానికి కాంగ్రెస్ కి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తుంది ఈ ఉపఎన్నికల ఫలితాలు చూస్తుంటే. ఇది ఇలా ఉంటె మూడు లోకసభ, రెండు శాసనసభ స్థానాల కోసం శనివారం ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తానికి బళ్లారిలో , జమఖండిలోనూ కాంగ్రెస్ తన సతా చూపిస్తుంది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Click here  : కాంగ్రెస్ లో విబేధాలు – గాంధీభవన్ ఎదుట కార్యకర్త రచ్చ

You might also like