Saakshyam
Nothing scared but the truth

రాజమౌళి RRR ఓపెనింగ్ కి రాబోతున్న గెస్ట్స్ ఎవరో తెలిస్తే…?

0

RRR Movie opening, NTR, Rajamouli

బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా RRR ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోస్ ఆ విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందంతో ఊగిపోతున్నారు, సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, దానికి తగ్గట్టుగా రాజమౌళి సినిమాకి సంబంధించి రోజుకొక అప్డేట్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు ఇక అది చూసి ఇటు మెగా ఫాన్స్ అటు ఎన్టీఆర్ ఫాన్స్ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటివరకి తెలుగు ఇండస్ట్రీ లో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి కాని ఇలాంటి మల్టీ స్టారర్ ఇంతవరకు రాలేదు దానికోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇన్నాళ్టికి ప్రేక్షకుల కోరిక మేరకు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో ముగ్గురు ముద్దు గుమ్మలు సందడి చేయ్యనున్నారట, ఇందులో ఇంకొక స్పెషాలిటి ఏమిటంటే ఆ ముగ్గురిలో ఒకరు ఫారెన్ భామా కూడా ఉందట, ఈ సినిమాకి DVV దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న ఈ సినిమాను అధికారికంగా నవంబర్ 11 న ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నది అని వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమాపైన నేట్టింట్లో మరొక వార్త హల్చల్ చేస్తుంది అదేమిటంటే..ఈ సినిమా ఓపెనింగ్(RRR Movie opening) కి రాజమౌళి స్పెషల్ గెస్ట్స్ ని ఇన్వైట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆ స్పెషల్ గెస్ట్స్ ఎవరు అనేది అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఆ స్పెషల్ గెస్ట్స్ ఎవరు అంటే..ఇండస్ట్రీ లో రాజమౌళి కి బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రభాస్, అలాగే ఎన్టీఆర్ తరుపున బాలకృష్ణ, రామ్ చరణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు అని సమాచారం..అలాగే వీరు కాకుండా రమ్యకృష్ణ, అనుష్క, రానా,తమన్నా మరికొంతమంది సినిమాకి సంబంధించిన వారు హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబందించిన విశేషాలు చిత్ర ఓపెనింగ్ రోజు తెలియనున్నాయని సమాచారం. చూద్దాం నిజంగానే ఈ సినిమా ఓపెనింగ్ కి వీరందరూ వస్తున్నారో లేదో..ఒకవేళ వస్తే ఆ కిక్కే వేరబ్బా..

Click here : రెడీగా ఉండండి ఈ నవంబర్ 18 నే మోత మొదలు…?

You might also like