Saakshyam
Nothing scared but the truth

జెండా కట్టినందుకు చింతమనేని దౌర్జన్యం

Chinthamaneni Prabhakar revenge on people | Telugu political news | Saakshyam

0

Chinthamaneni Prabhakar revenge on people | Telugu political news | Saakshyam

రాష్ట్రంలో రోజురోజుకి టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డే లేకుండా పోతుంది. మరోవైపు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని లాంటి నాయకుల ఆగడాలకు అడ్డు లేకుండా (Chinthamaneni Prabhakar revenge on people) పోతోంది. వైఎస్సార్‌ సీపీ జెండాను ఇంటిపై కట్టినందుకు ఓ వ్యక్తిపై కక్ష సాధింపునకు దిగారు. ప్రభుత్వ భూమిగా సాకు చూపి, ఆ వ్యక్తి ఇంటి స్థలంలో నుంచి రోడ్డు వేయించే పనికి పూనుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా విజయ్‌కుమార్, పిట్టా స్టీఫెన్‌కు వారసత్వంగా సంక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. వారు జగన్ పై  అభిమానంతో ఇంటిపై వైసీపీ జెండా కట్టారు. దీంతో భగ్గుమన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆ స్థలం ప్రభుత్వానిదంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రహదారి నిర్మించేందుకు పూనుకున్నారు.

Chinthamaneni Prabhakar revenge on people | Telugu political news | Saakshyam

అందుకోసం అధికారులు ఇంటిని తొలగించేందుకు సిద్ధం కావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంఘటన స్థలానికి వెళ్లి ఎమ్మార్వోతో చర్చలు జరిపారు. రెండురోజులు గడువు ఇచ్చిన అధికారులు, హఠాత్తుగా  తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగి ఇంటి తొలగింపునకు చర్యలు చేపట్టారు. తొలగింపు పనులను అడ్డుకున్న విజయకుమార్‌ భార్య విజయకుమారిని పోలీసులు నెట్టివేయడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటగిరి శ్రీధర్, దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొఠారు అబ్బయ్య చౌదర, ఆమెను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్య అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో చింతమనేనికి ప్రజలు తగిన బుద్ది చెప్తారని తెలిపారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like