Saakshyam
Nothing scared but the truth

ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా…?చనిపోయిన కూడా…?

0

Karnool, Rowdies, Chennayya Murder

ఇది సినిమాలా ప్రభావమో లేక ఇంకేమో తెలియడం లేదు కాని ఈ మధ్య కాలంలో జనాలు ప్రతి ఒక్కరు కూడా హీరోని తలపించేలా ప్రవర్తిస్తున్నారు. ఒకరిపైన కోపం వచ్చిందంటే చాలు రెచ్చిపోయి వారిపైన తిరగబడుతున్నారు తిరగబడడం సంగతి కాసేపు పక్కన పెడితే నరకడాలు నరికేయ్యడాలు ఇదే సరిపోతుంది. ఆ పని చేసేముందు వెనుకాముందు ఆలోచించకుండా భయపడకుండా నడి రోడ్డుపైనే ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. ఇప్పుడు ఈ నరకడాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే తాజాగా కర్నూల్ (Karnool) జిలాలో ఒక ఘటన చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లాలో సాయిబాబాగిరి ప్రాంతంలో రౌడీ షీటర్ చెన్నయ్య ఉంటున్నాడు. అతను ఎప్పటిలాగే నిన్న రాత్రి కూడా ఇంటి నుండి బలదేరి బయటకు వెళ్ళాడు ఇక అలా బయటకి వెళ్ళిన చెన్నయ్య తెల్లవారు జాము అయిన కూడా ఇంటికి తిరిగిరాలేదు.

రాత్రికి రాత్రే రౌడి షిటర్స్ చెన్నయ్యని నరికి ముక్కలు ముక్కలు చేసి తుంగబధ్ర నదిలో పడేశారు. అతని మరణించాడు అని తెలిసిన కూడా అతని గుండెని పెకలించి తీసుకెళ్లారు. ఇక తెల్లవారు జామున ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిగా ఘటన స్థలానికి చేరుకొని చనిపోయింది చెన్నయ్యేనని గుర్తించారు. ఈ నేపధ్యంలో ఈ విషయంపై ఒక పొలిసు మాట్లాడుతూ ఈ ఘటన జరగడానికి గల కారణం పాత కక్షలే అంటూ అందుకే చేన్నయ్యని అతి దారుణంగా చంపేశారు అంటూ ఉన్నత పొలిసు అధికారి పేర్కొన్నారు. తదుపరి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపామని వెల్లడించారు. దుండగులు చెన్నయ్య శరీరం నుంచి గుండెను పెకలించి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మొత్తానికి రౌడిలు ఈ మధ్య కాలంలో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

Click here : గోషామల్ టిఆర్ఎస్ నేత కుమారుడిపై రాజకీయ దాడి..?

 

You might also like