Saakshyam
Nothing scared but the truth

దోచిన డబ్బుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Chandrababu using looted money in other states

0

Chandrababu using looted money in other states | Telugu political news

చంద్రబాబు రాష్ట్రంలో దోచిన డబ్బుతో మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ (Chandrababu using looted money in other states) సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన డీల్‌ ఏంటో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. గత కర్ణాటక ఎన్నికల్లోనూ టూరిస్టుల బస్సుల్లో డబ్బును టీడీపీ పార్టీ తరలించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రకటనల్లో చంద్రబాబు ఫోటో పెద్దదిగా వేస్తున్నారని, తెలంగాణ ఎన్నికలకు రూ.1200 కోట్లు చంద్రబాబు తరలించారని మండిపడ్డారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు కూడా చంద్రబాబు రూ.500 కోట్లు పంపారని ధ్వజమెత్తారు. నంద్యాల ఎన్నికల్లో ఒక్కో ఓటుకు టీడీపీ రూ.5 వేలు ఖర్చుపెట్టిందన్నారు. ఏపీలో దోచిన డబ్బంతా ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని నిప్పులు చెరిగారు.

ఈ తతంగాన్ని మొత్తం చూస్తే రాష్ట్రాన్ని బాబు ఎలా దోచుకున్నారో అ​ర్థం అవుతోంది. ఏ రోజు ఎంత డబ్బు తరలిస్తారు, ఎక్కడ దాస్తున్నారో వివరిస్తా. నాలుగేళ్లుగా విజయవాడలో ఒక బ్రిడ్జి కట్టలేని వ్యక్తి చంద్రబాబు. తెలంగాణలో తానే అభివృద్ధి చేశాడని బాబు గొప్పలు చెబుతున్నారు. 2013లో అవినీతి పరులు కాంగ్రెస్‌లో చేరుతారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కాంగ్రెస్‌లోనే చేరిపోయారు. అవినీతితో చంద్రబాబు హిమాలయ అంచులకు వెళ్లారు. నీతిమంతుడిని, సీనియర్‌ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబువి నీచ రాజకీయాలు. జనసేన కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది.

Chandrababu using looted money in other states | Telugu news

రానున్న తెలంగాణ ఎన్నికలలో  మీ మనస్సాక్షిగా ఓటు వేయండి. దేశంలో టీడీపీ ఎక్కడ పోటీ చేసినా బుద్ధి చెప్పండి. ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి. 30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది. దళితులు, ఎస్సీలు, ఎస్టీలకు న్యాయం చేసేది వైఎస్సార్‌సీపీనే. దళితుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనేక సార్లు యూటర్న్‌ తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు రాష్ట్రానికి ద్రోహం చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీల హామీలను నమ్మడం లేదు. 25కు 25 ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీకి ఇవ్వండి. ఏపీకి హోదాపై సంతకం పెట్టిన పార్టీకి మద్దతిస్తాం. ఏపీ ప్రజలను విడగొట్టి అన్యాయం చేసింది కాంగ్రెస్‌. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు. ఇప్పుడు టీడీపీని అదే కాంగ్రెస్‌కు చంద్రబాబు దగ్గరగా చేర్చారు అని విజయసాయి రెడ్డి తెలిపారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:కాంగ్రెస్‌ను ఓడించండి: చంద్రబాబు

You might also like